బాలీవుడ్ లో యుద్ధానికి సిద్ధమంటున్న ఎన్టీఆర్
NTR : యంగ్ టైగర్ ఎన్టీఆర్ పాన్ ఇండియా సినిమా ‘వార్ 2’ తో బాలీవుడ్ యుద్ధభూమిలో అడుగుపెట్టడానికి సిద్ధమయ్యారు. హృతిక్ రోషన్, ఎన్టీఆర్(NTR) ప్రధాన పాత్రల్లో ‘వార్ 2’ నిర్మిస్తున్నట్లు నిర్మాణ సంస్థ నుండి ఇప్పటికే క్లారిటీ రాగా… షూటింగ్ కు కూడా ముహూర్తం ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో నిర్మిస్తున్న దేవర సినిమా షూటింగ్ లో బిజీ ఉన్న తారక్ జనవరి నుండి ‘వార్ 2’ సెట్ లో అడుగుపెట్టడానికి సిద్ధపడినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న ‘వార్ 2’ చిత్ర బృందం… వచ్చే నెలాఖరు నుండి రెగ్యులర్ షూటింగ్ కు సన్నాహాలు చేస్తుంది. దీనితో జనవరిలో ‘వార్ 2’ షూటింగ్ కోసం ఎన్టీఆర్ డేట్స్ కేటాయించినట్లు తెలుస్తోంది.
NTR – కొరటాల శివ ‘దేవర’తో బిజీగా ఉన్న తారక్
టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘దేవర(Devara)’. ఎన్టీఆర్, సైఫ్ ఆలీఖాన్, జాన్వీకపూర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాను రెండు పార్టుల్లో విడుదల చేస్తున్నట్లు ఇప్పటికే చిత్ర యూనిట్ స్పష్టం చేసింది. ఆర్ రత్నవేల్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్న ఈ సినిమాకు మ్యూజిక్ సన్సేషన్ అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. ఫార్ట్-1 షూటింగ్ డిసెంబరుతో పూర్తికావస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే తారక్ జనవరిలో ‘వార్ 2’కు డేట్ కేటాయించినట్లు ప్రచారం జరుగుతోంది.
‘వార్’ సీక్వెల్ ‘వార్ 2’
హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్, వాణి కపూర్ ప్రధాన పాత్రల్లో 2019లో యాక్షన్ థ్రిల్లర్ గా వచ్చిన ‘వార్’ బాక్సాఫీస్ ముందు కలెక్షన్ల వర్షం కురిపించింది. యస్ రాజ్ పిలిమ్స్ ఆధ్వర్యంలో ఆదిత్య చోప్రా నిర్మించిన ఈ చిత్రానికి సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించారు. సుమారు 150 కోట్లతో తెరకెక్కిస ఈ సినిమా అక్టోబరు, 2, 2019న రిలీజ్ చేయగా ప్రపంచవ్యాప్తంగా 475 కోట్లకు పైగా వసూళ్ళను సాధించింది. దీనితో వార్ కు కొనసాగింపుగా ఆదిత్య చోప్రా సిద్ధం చేసిన ‘వార్ 2’ కధను దర్శకత్వం వహించానికి అయాన్ ముఖర్జీ మందుకు వచ్చారు. కియారా అద్వానీ, జాన్ అబ్రహం, షబ్బీర్ అహ్లువాలియాలు కూడా ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించబోతున్నారు. స్టైలిష్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందనున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ ప్రతినాయక ఛాయలున్న పాత్రలో కనిపించనున్నారని టాక్. ఈ సినిమా జనవరి 24, 2025న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేసింది. అందుకే జనవరి నుండి తారక్ ‘వార్ 2’ సెట్లోకి అడుగు పెట్టబోతున్నట్లు తెలుస్తోంది.
Also Read : Venky Kudumula: టాలీవుడ్ డైరెక్టర్ ఎమెషనల్ పోస్ట్