NTR Film Awards: కళావేదిక ఎన్టీఆర్ ఫిలిం అవార్డ్స్ వేడుకని ఈ నెల 29న హైదరాబాద్‌లో నిర్వహించనున్నారు. కళావేదిక, రాఘవి మీడియా సంస్థల ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమంలో సినిమా రంగంలోని వివిధ విభాగాలకు చెందిన కళాకారులకు పురస్కారాల్ని ప్రదానం చేయనున్నారు. ఈ వేడుకకి సంబంధించిన పోస్టర్‌ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు. సినీ, రాజకీయ, వ్యాపార రంగాలకి చెందిన పలువురు ప్రముఖులు ఇందులో పాల్గొననున్నట్టు నిర్వాహకులు తెలిపారు.
NTR Film Awards..
కళా వేదిక, రాఘవి మీడియా సంస్థలు సంయుక్తంగా ప్రతీ ఏటా ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్ ను అందిస్తున్నారు. ఇటీవల ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు కూడా జరగడం… మరోవైపు ఏపీలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ కూటమి అధికారంలోనికి రావడంతో… ఈ ఫిల్మ్ అవార్డులను ఘనంగా నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు. దీనిలో భాగంగా ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్ పోస్టర్ ను ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు చేతులమీదుగా ఆవిష్కరించారు.
Also Read : Ananya Nagalla: ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చిన మరో టాలీవుడ్ బ్యూటీ !