NTR Devara: ఎన్టీఆర్ ‘దేవర’ ఫస్ట్ గ్లింప్స్ రెడీ !

ఎన్టీఆర్ ‘దేవర’ ఫస్ట్ గ్లింప్స్ రెడీ !

NTR Devara: స్టైలిష్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ జంటగా నటిస్తున్న చిత్రం ‘దేవర’. సుధాకర్‌ మిక్కిలినేని, కొసరాజు హరికృష్ణ నిర్మాతలుగా ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాకి మ్యూజిక్ సన్సేషన్ అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. రెండు పార్టులుగా విడుదల చేస్తున్న ఈ సినిమాను 2024 ఏప్రిల్ 5 మొదటి పార్టును విడుదల చేస్తున్నట్లు ఇప్పటికే చిత్ర యూనిట్ ప్రకటించింది. ఇటీవల జపాన్ లో షూటింగ్ పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకున్న చిత్ర యూనిట్… ఎన్టీఆర్ అభిమానులకు సంక్రాంతి కానుకను ఇస్తున్నట్లు ప్రకటిచింది. ఈ నెల 8న ‘దేవర’ సినిమా ఫస్ట్ గ్లింప్స్ ను విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. అంతేకాదు దీనికి సంబంధించి ఓ కొత్త పోస్టర్ ను విడుదల చేసింది.

NTR Devara – ఆశక్తికరంగా ఎన్టీఆర్‌ ‘దేవర’ కొత్త పోస్టర్

ఎన్టీఆర్‌ ‘దేవర’ సినిమా ఫస్ట్ గ్లింప్స్ ను ఈ నెల 8న విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ సోమవారం అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు ఓ కొత్త పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ పోస్టర్ లో ఎగసిపడుతున్న అలలతో కల్లోలంగా ఉన్న సముద్రంలో… పడవపై ఓ కెరటంలా దూసుకొస్తూ ఎన్టీఆర్‌(NTR) కనిపించారు. బ్యాగ్రౌండ్‌లో కారు మబ్బులతో కమ్ముకొని ఉన్న ఆకాశం… చుట్టూ ఉన్న పడవలు… సీరియస్‌గా చూస్తూ కనిపించిన ఎన్టీఆర్ తీరు సినిమాపై ఆసక్తి రేకెత్తించేలా ఉన్నాయి.

‘జనతా గ్యారేజ్‌’ సూపర్ హిట్‌ తర్వాత ఎన్టీఆర్‌ – కొరటాల శివ కాంబినేషన్ లో రూపొందుతోన్న రెండో సినిమా ‘దేవర’. మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ముస్తాబవుతోన్న ఈ సినిమాని రెండు పార్టులుగా విడుదల చేస్తుండగా… ‘దేవర పార్ట్‌ 1’ పేరుతో ఏప్రిల్‌ 5న థియేటర్లలోకి వస్తుంది. ఈ సినిమాలో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్‌ హీరోయిన్ గా నటించగా… సైఫ్‌ అలీ ఖాన్‌ విలన్ గా నటిస్తున్నారు. ఈ సినిమాకు మ్యూజిక్ సన్సేషన్ అనిరుధ్‌ సంగీతమందిస్తుండగా… రత్నవేలు సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు.

Also Read : Hero NTR: జపాన్ భూకంపంపై ఎన్టీఆర్ దిగ్భ్రాంతి

DevaraNTR
Comments (0)
Add Comment