NTR 31: రెండు భాగాలుగా ఎన్టీఆర్‌ – ప్రశాంత్ నీల్ సినిమా ?

రెండు భాగాలుగా ఎన్టీఆర్‌ - ప్రశాంత్ నీల్ సినిమా ?

NTR 31: భారతీయ చలన చిత్ర పరిశ్రమలో సీక్వెల్స్ ట్రెండ్ నడుస్తోంది. ఏదైనా కథను వివరంగా ప్రేక్షకులకు చూపించాలంటే రెండు భాగాలుగా రూపొందించాలని దర్శక నిర్మాతలు భావిస్తున్నారు. బాహుబలి, కేజీఎఫ్, సలార్, దేవర, కాంతారా, సింగం, లాంటి భారీ బడ్జెట్ సినిమాలతో పాటు కిక్, హిట్, గూఢాచారి, రాజుగారి గది, ఎప్2 ఇలా చాలా సినిమాలు రెండు భాగాలుగా వచ్చినవే. కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా డైరక్టర్ గా మారిన ప్రశాంత్ నీల్ తన తరువాత సినిమా సలార్ ను కూడా రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. సలార్ పార్ట్ 1: సీజ్ ఫైర్ ఇప్పటికే విడుదలై బాక్సాఫీసు వద్ద భారీ విజయాన్ని నమోదు చేయగా… దానికి సీక్వెల్ గా ‘సలార్‌2: శౌర్యాంగ పర్వం’ తెరకెక్కించేందుకు సిద్ధంగా ఉన్నారు.

NTR 31 Movie

మరోవైపు యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో ఓ సినిమాను ప్రకటించారు. మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన వివరాలను ఇప్పటికే ‘ఎన్టీఆర్‌31’ వర్కింగ్‌ టైటిల్‌ తో ప్రకటించారు. కేజీఎఫ్, సలార్ లాంటి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ల తరువాత వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలు భారీగా పెరిగిపోయాయి. అయితే కేజీఎఫ్, సలార్ సినిమాను రెండు పార్టులుగా తీసిని దర్శకుడు ప్రశాంత్ నీల్…. ‘ఎన్టీఆర్‌31’ కూడా రెండు పార్టులుగా తీస్తారనే ప్రచారం సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది.

ఈ విషయంపై చిత్ర యూనిట్ నుండి ఎలాంటి అధికారిక ప్రకటన లేకపోయినప్పటికీ… ప్రశాంత్ నీల్ పాత సినిమాల చరిత్రను బట్టి రెండు పార్టులుగా రావడం ఖాయమనే వాదన వినిపిస్తోంది. మరోవైపు ప్రస్తుతం ఎన్టీఆర్(NTR)… కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ‘దేవర’ సినిమాలో నటిస్తున్నారు. సముద్రతీరం నేపథ్యంలో సాగే ఈ యాక్షన్‌ డ్రామాను కూడా రెండు పార్టులుగా తీస్తున్నట్లు ప్రకటించారు. ఎన్టీఆర్ సరసన భాలీవుడ్ భామ జాన్వీకపూర్… విలన్ పాత్రలో సైఫ్ అలీఖాన్ నటిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన దేవర పార్టు 1 ను అక్టోబర్ 10న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు.

Also Read : Megastar Chiranjeevi: బెంగుళూరు వాసులకు మెగాస్టార్ సలహా ! వైరల్ గా మారుతున్న ట్వీట్ !

DevaraNTRprasanthneelsalar
Comments (0)
Add Comment