Actor Ali : అనుమతులు లేకుండా నిర్మాణాలు చేశారంటూ ఆలీకి నోటీసులు

Actor Ali : టాలీవుడ్ యాక్టర్ అలీకి వికారాబాద్‌ జిల్లా నవాబ్‌పేట మండలం ఎక్‌మామిడి పరిధిలో వ్యవసాయ భూమి ఉంది. ఆయన ఫ్యామిలీతో కలిసి తరుచుగా అక్కడకు వెళ్తుంటారు. అక్కడ తాజాగా పర్మిషన్ లేకుండా ఫామ్ హౌస్ నిర్మాణాలు చేస్తున్నారని అధికారులకు ఫిర్యాదు అందాయి. దీంతో అలీకి గ్రామ కార్యదర్శి శోభారాణి నోటీసులు జారీ చేశారు. నిర్మాణాలు ఆపివేయాలని సూచించారు.

Actor Ali..

ఎక్‌మామిడిరెవెన్యూ పరిధి సర్వే నెంబరు 345లోని ఫామ్‌హౌస్‌లో నిర్మాణాలకు సంబంధించి డాక్యూమెంట్స్ సబ్మిట్ చేసి పర్మిషన్స్ తీసుకోవాలని ఈ నెల 5న అలీకి నోటీసులు ఇచ్చినట్లు తెలిసింది. ఆయన రెస్పాండ్ కాకపోవడంతో మరోసారి పంచాయతీ కార్యదర్శి నోటీసులు ఇచ్చారు. సంబంధిత డాక్యూమెంట్స్ సమర్పించి అనుమతులు పొందాలని సూచించారు. లేని పక్షంలో పంచాయతీరాజ్‌ యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకుంటామని అందులో పేర్కొన్నారు. వ్యయసాయ క్షేత్రంలో పని చేసే వారికి నోటీసులు అందించామని సెక్రటరీ తెలిపారు. ఈ నోటీసులు అందుకున్న నేపథ్యంలో అలీ కూడా రిప్లై ఇవ్వడానికి రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది.

Also Read : Satya Dev : నేను హిట్ అవుతుందనుకున్న ప్రతి సినిమా నాకు రివర్స్ అయ్యింది

Actor AliUpdatesViral
Comments (0)
Add Comment