Kangana Ranaut: కంగన రనౌత్‌ ‘ఎమర్జెన్సీ’ మేకర్స్‌ కు లీగల్‌ నోటీసులు !

కంగన రనౌత్‌ ‘ఎమర్జెన్సీ’ మేకర్స్‌ కు లీగల్‌ నోటీసులు !

Kangana Ranaut: బాలీవుడ్ అగ్ర న‌టి, ఎంపీ కంగ‌నా రనౌత్(Kangana Ranaut) స్వీయ దర్శకత్వంలో నిర్మించి నటిస్తున్న తాజా చిత్రం ‘ఎమర్జెన్సీ’. స్వతంత్ర్య భారతదేశంలో చీకటిరోజులుగా పిలిచే ఎమెర్జెన్సీ నాటి పరిస్థితులు ఆధారంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో అప్పటి ప్రధాని మంత్రి ఇందిరా గాంధీ పాత్రలో కంగనా కనిపించనుంది. జయప్రకాష్‌ నారాయణ్‌ పాత్రలో అనుపమ్‌ ఖేర్‌, మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయీ పాత్రలో శ్రేయస్ తల్పడే కనిపించనున్నారు. కంగనా స్వంత నిర్మాణ సంస్థ మణికర్ణిక ఫిలిమ్స్ నిర్మాణంలో స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఈ పొలిటికల్ డ్రామాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Kangana Ranaut…

భారత తొలి మహిళా ప్రధాని ఇందిరా గాంధీ రాజకీయ జీవితం ఆధారంగా ఈ ‘ఎమర్జెన్సీ’ సినిమాను రూపొందించారు. అయితే ఇందులో తమ వర్గం గురించి తప్పుగా చిత్రీకరించారంటూ శిరోమణి గురుద్వార ప్రబంధక్‌ కమిటీ (ఎస్‌జీపీసీ) పేర్కొంది. ఈ మేరకు కంగన సహా పలువురికి లీగల్‌ నోటీసులు పంపింది.

‘‘ఈ నెల 14న విడుదలైన ‘ఎమర్జెన్సీ’ ట్రైలర్‌ను సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్స్‌ నుంచి తొలగించాలి. మా కమ్యూనిటీకి మేకర్స్‌ లిఖిత పూర్వకంగా క్షమాపణలు చెప్పాలి’’ అని ఎస్‌జీపీసీ నోటీసులో పేర్కొంది. మరోవైపు, ఈ చిత్రాన్ని బ్యాన్‌ చేయాలంటూ ఎస్‌జీపీసీ ఇప్పటికే డిమాండ్‌ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ట్రైలర్ విడుదల అయిన నాటి నుండి కంగన హత్య బెదిరింపులు కూడా ఎదుర్కొంటున్నారు. సంబంధిత వీడియోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తూ.. తగిన చర్యలు తీసుకోవాలంటూ మహారాష్ట్ర, పంజాబ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ పోలీసు శాఖలకు ఆమె విజ్ఞప్తి చేశారు. జీ స్టూడియోస్‌ సంస్థతో కలిసి కంగన నిర్మించిన ఈ సినిమా సెప్టెంబరు 6న విడుదల కానుంది.

Also Read : Dil Raju: ‘గేమ్‌ ఛేంజర్‌’ విడుదలపై నిర్మాత దిల్‌ రాజు క్లారిటీ !

emergencyKangana Ranaut
Comments (0)
Add Comment