Kanchana 4 : బాలీవుడ్ లో తన డ్యాన్సులతో హోరెత్తిస్తూ కుర్రకారు గుండెలను మీటి స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందింది నోరా ఫతేహి(Nora Fatehi). తన అంద చందాలతోనే కాదు అద్భుతమైన స్టెప్పులతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది ఈ అమ్మడు. ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.
Kanchana 4 Shooting
తమిళ సినీ నటుడు, నృత్య దర్శకుడు రాఘవ లారెన్స్ నటించి, దర్శకత్వం వహించిన హారర్ , సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కించిన కాంచన సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. కాసుల వర్షం కురిపించింది. తమిళం, కన్నడ, తెలుగు, హిందీలలో కూడా విడుదలై దుమ్ము రేపింది. బాక్సులు బద్దలు కొట్టింది.
దీంతో నటుడు, దర్శకుడు లారెన్స్ సీక్వెల్ కూడా తీశాడు కాంచన పేరుతో . అది కూడా బిగ్ హిట్ గా నిలిచింది. తాజాగా మరో సంచలన ప్రకటన చేశాడు. కాంచన4 తీస్తున్నట్లు వెల్లడించాడు. ఇందులో పలువురి హీరోయిన్ల పేర్లు కూడా నటిస్తున్నట్లు ప్రచారం జరిగింది. మొదట పూజా హెగ్డే నటిస్తుందని సమాచారం. కానీ అవన్నీ ఊహాగానాలేనంటూ తోసి పుచ్చాడు రాఘవ లారెన్స్.
ఈ మేరకు కాంచన 4 సీక్వెల్ మూవీలో కీలకమైన పాత్ర కోసం లవ్లీ బ్యూటీ నోరా ఫతేహిని ఎంపిక చేశామని తెలిపాడు. దీంతో ఈ సినిమాకు సంబంధించి షూటింగ్ హైదరాబాద్ లో ప్రారంభమైంది. ఇందులో కీలక సన్నివేశాలను ఫతేహి మీద చిత్రీకరించారు. ఈ సందర్బంగా కాంచన4లో ప్రత్యేకించి స్టార్ కొరియోగ్రాఫర్, నటుడు, దర్శకుడు లారెన్స్ తో నటించడం ఆనందంగా ఉందన్నారు నోరా.
Also Read : Hero Prabhas-Kannappa :కన్నప్ప కోసం పైసా తీసుకోని ప్రభాస్