Nivetha Thomas: ‘35-చిన్న కథ కాదు’ కె విశ్వనాథ్ సినిమాలా ఉంటుంది – నివేత థామస్

‘35-చిన్న కథ కాదు’ కె విశ్వనాథ్ సినిమాలా ఉంటుంది - నివేత థామస్

Nivetha Thomas: నివేత థామస్, ప్రియదర్శి, విశ్వదేవ్, గౌతమి, భాగ్యరాజ్ లీడ్ రోల్స్‌లో నటించిన న్యూ ఏజ్ క్లీన్ ఎంటర్‌ టైనర్ ‘35-చిన్న కథ కాదు’. సురేష్ ప్రొడక్షన్స్, ఎస్ ఒరిజినల్స్, వాల్టెయిర్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై రానా దగ్గుబాటి, సృజన్ యరబోలు, సిద్ధార్థ్ రాళ్లపల్లి నిర్మిస్తున్న ఈ చిత్రానికి నంద కిషోర్ ఈమాని రైటర్, డైరెక్టర్. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ మంచి స్పందనను రాబట్టుకోగా.. సినిమాను సెప్టెంబర్ 6న తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ క్రమంలో చిత్ర ప్రమోషన్స్‌ను మేకర్స్ యమా జోరుగా నిర్వహిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర విశేషాలను హీరోయిన్ నివేత థామస్(Nivetha Thomas) మీడియాకు తెలియజేశారు.

ఈ సందర్భంగా నివేత థామస్(Nivetha Thomas) మాట్లాడుతూ… ‘35-చిన్న కథ కాదు’ సింపుల్ అండ్ బ్యూటీఫుల్ స్టొరీ. స్టార్ట్ టు ఫినిష్ ఆ వరల్డ్‌లో కాంప్రమైజ్ లేకుండా రాసిన స్టోరీ. ఇందులో నేను కాకుండా సరస్వతి పాత్రే కనిపిస్తుంది. ఇలాంటి పాత్ర చేయడం నాకు చాలా ఇష్టం. ఇండియన్ సొసైటీలో 22 ఏళ్లకే ఎప్పుడు పెళ్లి చేసుకుంటారని జనరల్‌ గా అంతా అడుగుతుంటారు. నేను హౌస్ వైఫ్ క్యారెక్టర్ చేయడంలో పెద్ద ప్రాబ్లమ్ లేదు. యాక్టర్‌ గా అన్ని పాత్రలు చేయాలి. మదర్‌ గా బాగా చేశాను అనే బదులు సరస్వతి పాత్రని బాగా చేశానని మీరంతా చెబితే సంతోషిస్తాను.

నాకంటూ ఒక ప్యాట్రన్‌ని సెట్ చేసుకోవడం నాకు ఇష్టం వుండదు. నివేత ఏ పాత్రనైనా చేయగలదని దర్శకులు నమ్మగలిగితే యాక్టర్‌గా అంతకుమించిన ఆనందం, సక్సెస్ మరొకటి వుండదు. ఇందులో సరస్వతి పాత్రకు, నాకు ఏజ్‌లో పెద్ద తేడా లేదు. సరస్వతి ఏజ్‌లో నాకంటే ఏడాది చిన్నది. తనకి చిన్న ఏజ్‌లోనే పెళ్లి అవుతుంది. ఆమెకి పిల్లలు ఉన్నప్పటికీ ఆమెలో ఒక చైల్డ్ నేచర్ వుంటుంది. ఇందులో యూత్ లవ్ వుంటుంది. ఇవన్నీ ఎక్స్ ఫ్లోర్ చేయడం నాకు చాలా ఎక్సయిటింగ్‌గా అనిపించింది.

‘‘నంద కిశోర్‌ ‘35–చిన్న కథ కాదు’ కథని అద్భుతంగా రాశారు. విద్యా వ్యవస్థ గురించి గొప్పగా, భార్యాభర్త, పిల్లలు, టీచర్, స్టూడెంట్స్‌… ఇలాంటి బంధాల గురించి అందంగా చెప్పారు. ఈ సినిమా చూస్తున్నంత సేపూ కె. విశ్వనాథ్‌ గారి సినిమా చూస్తున్న అనుభూతి కలుగుతుంది. ఈ సినిమాలో వెంకటేశ్వర స్వామిని కూడా ఓ పాత్రలా చూపించారు దర్శకుడు’’ అన్నారు.

Nivetha Thomas – హేమాలాంటి కమిటీలు రావాలి – నివేత థామస్

‘‘మలయాళ చిత్ర పరిశ్రమలో ఉండటాన్ని నేను గర్వంగా భావిస్తున్నాను. ‘అమ్మ’లో నేను ఓ సభ్యురాలిని. హేమా కమిటీ నివేదికలో వెలుగు చూసిన అంశాలు బాధాకరం. ఆ విషయాల గురించి నేను నా కుటుంబ సభ్యులతో కూడా చర్చించాను. ఈ విషయంలో డబ్ల్యూసీసీ (ఉమెన్‌ ఇన్‌ సినిమా కలెక్టివ్‌)ని ప్రశంసించాలి. పని చేసే చోట మహిళలకు భద్రత కల్పించడం కనీస అవసరం. దీని గురించి నేనూ వినతి చేశాను. మలయాళ చిత్ర పరిశ్రమలోలాగే ఇతర ఇండస్ట్రీల్లోనూ హేమా లాంటి కమిటీలు వస్తే మంచిదే’’ అన్నారు నివేదా థామస్‌.

Also Read : Hero Nani : ఆ సినిమా మిస్ అయినా ‘సరిపోదా శనివారం’ బ్యాలెన్స్ చేసింది

35 Chinna Katha KaaduNivetha Thomas
Comments (0)
Add Comment