35 Chinna Katha Kaadu OTT : ఓటీటీలోను పాజిటివ్ రెస్పాన్స్ తో దూసుకుపోతున్న నివేత థామస్ సినిమా

రానా దగ్గుబాటి సమర్పణలో సృజన్ యరబోలు, సిద్ధార్థ్ రాళ్లపల్లి 35- ఒక చిన్న కథ కాదు నిర్మించారు...

35 Chinna Katha Kaadu : టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ నివేదా థామస్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 35 చిన్న కథ కాదు. చదువు విషయంలో పిల్లలకు తల్లి దండ్రుల సపోర్టు ఎంత ముఖ్యమనే యూనివర్సల్ పాయింట్ తో ఈ సినిమాను తెరకెక్కించారు డైరెక్టర్ నంద కిశోర్. ఇక ఈ సినిమా కథ నచ్చడంతో ప్రముఖ హీరో దగ్గుబాటి రానా 35 చిన్న కథ కాదు(35 Chinna Katha Kaadu) మూవీకి నిర్మాతగా వ్యవహరించారు. నివేదా థామస్ తో పాటు విశ్వదేవ్ రాచకొండ, ప్రియదర్శి, అరుణ్ దేవ్, గౌతమి, అభయ్ శంకర్, భాగ్యరాజ్ తదితరులు ఈ మూవీలో ప్రధాన పాత్రలు పోషించారు. టీజర్లు, పోస్టర్స్, ట్రైలర్ ఆకట్టుకునేలా ఉండడం, ప్రమోషన్లు కూడా పెద్ద ఎత్తున చేయడంతో రిలీజ్ కు ముందే 35 చిన్న కథ కాదు సినిమాపై పాజిటివ్ బజ్ క్రియేట్ అయ్యింది.

అందుకు తగ్గట్టుగానే సెప్టెంబర్ 6 న థియేటర్లలో విడుదలైన ఈ ఫీల్ గుడ్ మూవీ సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. విమర్శకులతో పాటు పలువురి సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకుంది. ముఖ్యంగా పిల్లలు, పేరెంట్స్ ఈ సినిమాకు బాగా కనెక్ట్ అయ్యారు. థియేటర్లలో ఆడియెన్స్ మెప్పు పొందిన ఈ ఫీల్ గుడ్ మూవీ ఇప్పుడు ఓటీటీలోనూ అదరగొడుతోంది. ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఆహా 35 చిన్న కథ కాదు(35 Chinna Katha Kaadu) సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది. అక్టోబర్ 02 అర్ధరాత్రి నుంచి ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. ఈ నేపథ్యంలో నివేదా థామస్ ఫీల్ గుడ్ మూవీకి ఓటీటీలోనూ సూపర్ రెస్పాన్స్ వస్తుందని ఆహా తెలిపింది. ఇప్పటికే ఈ సినిమా 70 మిలియన్ల స్ట్రీమింగ్ మినిట్స్ ను దాటేసిందని అధికారికంగా ప్రకటించింది.

35 Chinna Katha Kaadu OTT Updates

రానా దగ్గుబాటి సమర్పణలో సృజన్ యరబోలు, సిద్ధార్థ్ రాళ్లపల్లి 35- ఒక చిన్న కథ కాదు(35 Chinna Katha Kaadu) నిర్మించారు. వివేక్ సాగర్ స్వరాలు సమకూర్చారు. నికేత్ బొమ్మి సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించారు. ఇక సినిమా కథ విషయానికి వస్తే.. మూవీ మొత్తం తిరుపతి నేపథ్యంలో సాగుతుంది. మ్యాథ్స్ లో వెనుకపడిన విద్యార్థిని టీచర్ జీరో అని పిలుస్తుంటాడు. స్కూల్‍లో కంటిన్యూ కావాలంటే గణితంలో కనీసం 35 మార్కులు తెచ్చుకోవాలని కండీషన్ పెడతాడు. దీంతో కొడుకు కోసం తల్లి (నివేదా థామస్) మ్యాథ్స్ నేర్చుకుంటుంది. ఆ తర్వాత కొడుక్కి కూడా నేర్పిస్తుంది. మరి టీచర్ చెప్పినట్లు పిల్లాడు మ్యాథ్స్ లో పాస్ మార్కులు తెచ్చుకున్నాడా? అనేది ఈ మూవీ మెయిన్ పాయింట్. పిల్లల చదువు గురించి ఒక మంచి ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తీర్చిదిద్దారు. కచ్చితంగా పిల్లలతో పాటు పేరెంట్స్ కూడా కలిసి చూడాల్సిన సినిమా ఇది అంటున్నారు మేకర్స్.

Also Read : Hero Nikhil : దర్శకుడు సుధీర్ వర్మతో హ్యాట్రిక్ చిత్రానికి టైటిల్ ఇదే..

35 Chinna Katha KaaduOTTTrendingUpdatesViral
Comments (0)
Add Comment