Nivetha Pethuraj: హీరోయిన్లలో చాలామంది మల్టీ టాలెంటెడ్ అన్న సంగతి తెలిసింది. అందం, అభినయం, ఫిట్ నెస్, డ్యాన్స్ లతో పాటు ఆటల్లో కూడా మేటిగా ఉన్నవారు హీరోయిన్లుగా సక్సెస్ అవుతున్నారు. దీనికి గురు సినిమాలో నటించిన రితికా సింగ్… ఓ చక్కటి ఉదాహరణ. అయితే మెంటల్ మదిలో, బ్రోచేవారెవరురా, చిత్రలహరి, అల వైకుంఠపురములో, దాస్ కా ధమ్కీ లాంటి హిట్ సినిమాల్లో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన తమిళ బ్యూటీ నివేత పెతురాజ్ కూడా ఇప్పుడు ఈ కోవకే చెందుతుంది.
హీరోయిన్ గా తనకంటూ ఓ ఇమేజ్ తెచ్చుకున్న ఈ బ్యూటీ… ఇప్పుడు క్రీడల్లో కూడా రాణిస్తోంది. ఇటీవల మధురైలో జరిగిన బాడ్మింటన్ ఛాంపియన్ షిప్ పోటీల్లో మిక్స్ డ్ డబుల్స్ విభాగంలో కప్ కొట్టి విజేతగా నిలిచింది. కప్ గెలిచిన ఆనంద క్షణాల్ని తన అభిమానులతో పంచుకుంటూ… మరో కప్ కోసం వెయిటింగ్ అనే అర్థం వచ్చేలా నెక్ట్స్ ఏంటి అంటూ కొటేషన్ కూడా పెట్టింది. దీనితో ఈ ఫోటోలు నెట్టింట వైరల్ కావడంతో అభిమానులు నివేతపై(Nivetha Pethuraj) ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
Nivetha Pethuraj Viral
నివేత పెతురాజ్ కు ఆటలంటే చాలా ఇష్టం. ఈ విషయాన్ని ఆమె అనేక సందర్భాల్లో వెల్లడించింది. బ్యాడ్మింటన్ తో పాటు స్విమ్మింగ్, కార్ రేసింగ్ లో కూడా ఆమెకు ప్రవేశం ఉంది. ఫార్ములా రేసు కార్ ట్రైనింగ్ ప్రొగ్రామ్ లో లెవెల్-1 సర్టిఫికేట్ అందుకున్న నివేత… గతంలో తన కార్ల కలెక్షన్ ను కూడా బయటపెట్టింది. ఆమె ఫస్ట్ కారు టయోటా యారిస్ కాగా… ఆ తరువాత డాడ్జ్ ఛాలెంజర్, బెలెనో, బీఏండబ్ల్యూ ఎక్స్4 లను కొనుగోలు చేసింది. అప్పట్లో దుబాయ్ లో డాడ్జ్ ఛాలెంజర్ కారు కొన్న రెండో మహిళగా నివేత రికార్డు సృష్టించింది. ఇప్పుడు బ్యాడ్మింటన్ లో కూడా రాణిస్తూ మధురై బాడ్మింటన్ ఛాంపియన్ షిప్ పోటీల్లో మిక్స్ డ్ డబుల్స్ కప్ కొట్టింది.