Nivetha Pethuraj: ఆశక్తికరంగా నివేథా పేతురాజ్‌ వెబ్‌ సిరీస్‌ ‘పరువు’ ట్రైలర్‌ !

ఆశక్తికరంగా నివేథా పేతురాజ్‌ వెబ్‌ సిరీస్‌ ‘పరువు’ ట్రైలర్‌ !

Nivetha Pethuraj: అలా వైకుంఠాపురం, దాస్ కా ధ‌మ్కీ చిత్రంతో మంచి పేరు తెచ్చుకున్న న‌టి నివేథా పేతురాజ్ నటించిన తాజా వెబ్‌సిరీస్‌ ‘పరువు’. నరేశ్‌ అగస్త్య, నాగబాబు తదితరులు కీలక పాత్రలు పోషించారు. గోల్డెన్ బాక్స్ ఎంట‌ర్‌టైన‌మెంట్ బ్యాన‌ర్‌పై సుస్మిత కొణిదెల ఈ వెబ్ సిరీస్ నిర్మిస్తుంది. సిద్ధార్థ్‌ నాయుడు, వడ్లపాటి రాజశేఖర్‌ సంయుక్తంగా దర్శకత్వం వహించారు. ఈ సిరీస్‌ ఓటీటీ ‘జీ 5’లో ఈ నెల 14 నుంచి స్ట్రీమింగ్‌ కానున్న నేపథ్యంలో హీరో వరుణ్‌ తేజ్‌ ట్రైలర్‌ని ఆదివారం విడుదల చేశారు. ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Nivetha Pethuraj..

నివేథా పేతురాజ్ కొన్ని రోజుల క్రితం పోలీసుల‌తో గొడ‌వ‌ప‌డిన‌ట్లు వీడియోలు వైర‌ల్ అయిన విష‌యం తెలిసిందే. అయితే తాజాగా దీని వెనక గల మిస్టరీ బయట పడింది. ఇదంతా కూడా తన కొత్త సినిమా కోసం చేసిన ప్రమోషన్ స్టంట్ అని తెలిసిపోయింది. నివేథా పేతురాజ్(Nivetha Pethuraj) తాజాగా న‌టిస్తున్న వెబ్ సిరీస్ ‘పరువు’… ప్రమోషన్స్ కోసమే ఆ వీడియో చేసినట్లు మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. ఇప్ప‌టికే ఫ‌స్ట్ లుక్‌ తో పాటు ప్రీమియ‌ర్ తేదీని అనౌన్స్ చేశారు మేక‌ర్స్ తాజాగా ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు.

ఇక ప‌రువు ట్రైల‌ర్‌ విషయానికి వస్తే… నివేదా పేతురాజ్‌, నరేష్ అగస్త్య ప్రేమికులు. కులం వేరు కారణంగా ఇంట్లో ఒప్పుకోకపోవడంతో తెలీకుండా పారిపోతారు. ఈ క్రమంలోనే వారికి ఎదురైన సంఘ‌ట‌న‌లు ఏంటి అనేది సినిమా స్టోరీ. ఇక క్రైమ్ థ్రిల్ల‌ర్‌గా వ‌స్తున్న ఈ సిరీస్‌లో నాగ‌బాబు కీల‌క పాత్ర పోషిస్తుండ‌గా… గోల్డెన్ బాక్స్ ఎంట‌ర్‌టైన‌మెంట్ బ్యాన‌ర్‌పై సుస్మిత కొణిదెల నిర్మిస్తుంది. ఈ సిరీస్‌కు సిద్దార్థ్‌ – రాజశేఖర్ సంయ‌క్తంగా ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా.. ప్ర‌ముఖ ఓటీటీ వేదిక జీ5లో జూన్ 14 నుంచి స్ట్రీమింగ్ కానుంది.

Also Read : K. K. Senthil Kumar: నిఖిల్ సినిమా కోసం రాజమౌళి సినిమాటోగ్రాఫర్ !

Nivetha PethurajParuvuZee5
Comments (0)
Add Comment