Nivetha Pethuraj: పోలీసులతో నివేథా పేతురాజ్ వాగ్వివాదం ?

పోలీసులతో నివేథా పేతురాజ్ వాగ్వివాదం ?

Nivetha Pethuraj: అలా వైకుంఠాపురం, దాస్ కా ధ‌మ్కీ చిత్రంతో మంచి పేరు తెచ్చుకున్న న‌టి నివేథా పేతురాజ్. అందం, అభిన‌యం అన్నీ ఉన్నా సినిమా అవ‌కాశాలు అంత‌గా లేని ఈ ముద్దుగుమ్మ వెబ్ సిరీస్‌ ల‌లో కూడా న‌టిస్తోంది. ప్ర‌స్తుతం తెలుగులో ఏ సినిమాలో న‌టించ‌కున్నా తాజాగా ఈ అమ్మ‌డికి చెందిన ఓ వీడియో నెట్టింట బాగా వైర‌ల్ అవుతోంది. ఈ వీడియోలో నివేథా కారు డ్రైవింగ్ చేస్తున్న స‌మ‌యంలో పోలీసుల‌తో వాగ్వాదం చోటు చేసుకోవ‌డం క‌నిపించింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతూ… నివేథా అభిమానులను గందరగోళానికి గురిచేస్తుంది.

Nivetha Pethuraj…..

సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న ఈ వీడియోలో… నివేథా పేతురాజ్(Nivetha Pethuraj) కారును పోలీసులు ఆపి తనిఖీలు నిర్వహించడానికి ప్రయత్నిస్తుండగా వారితో ఆమె వాగ్వివాదానికి దిగినట్లు ఉంది. ఇది ఏ ప్రాంతంలో జ‌రిగిందో కానీ నివేథా కారును న‌డుపుకుంటూ వెళుతుండ‌గా మ‌ధ్య‌లో పోలీసులు ఆపి కారు వెన‌కాల‌ డిక్కీని తెర‌వాలంటూ కోరగా… అందుకు నివేథా అంగీక‌రించ‌లేదు. అది నా ప‌ర్స‌న‌ల్ అని అందులో మీకు చెప్ప‌లేనివి ఉన్నాయ‌ని, అది నా పరువుకు సంబంధించిన మ్యాటర్ అని పోలీసులకు సమాధానం చెప్తుంది.

ఈ క్రమంలో అక్క‌డే ఉండి ఈ దృశ్యాన్నంతా ఓ పొలీస్‌ వీడియో తీస్తుండ‌గా అత‌నిపై కూడా నివేథా ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో బాగా హ‌ల్‌ చ‌ల్ చేస్తుంది. అయితే.. నివేథా పేతురాజ్ ఇది కావాల‌ని చేస్తోంద‌ని, ఏదో సినిమా ప్ర‌మోష‌న్ కోసం ఇలా చేస్తోందంటూ కొంతమంది నెటిజ‌న్లు అభిప్రాయ ప‌డుతున్నారు. పైగా నివేథాతో వాగ్వివాదం చేస్తున్న పోలీసులు షూ వేసుకోకుండా ఖ‌రీదైన క్రాక్స్ చెప్పులు వేసుకుని ఉండ‌డం, వారు మాట్లాడే విధానం అంతా సినిమా స్టైల్‌లోనే ఉండ‌డంతో అంద‌రికీ ఈ వీడియోపై మరిన్ని డౌటనుమానాలు వ‌స్తున్నాయి. ఈ విష‌యంలో అస‌లు వాస్త‌వ‌మేంటో తెలియాల్సి ఉంది.

Also Read : Trisha Krishnan: నయనతార ప్లేస్‌ కొట్టేసిన త్రిష ?

Ala VaikunthapurramulooNivetha Pethuraj
Comments (0)
Add Comment