Nithya Menen: కథానాయిక ప్రాధాన్యం, నటనకు ఆస్కారమున్న పాత్రలకు కేరాఫ్ నిత్యామీనన్. అలా మొదలైంది సినిమాతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన నిత్యామీనన్… ఆ తరువాత నితిన్ సరసన ఇష్క్ సినిమాతో గుర్తింపు దక్కించుకుంది. ఆ తరువాత తెలుగు, కన్నడ, తమిళం, మలయాళంలో దాదాపు 50కి పైగా చిత్రాల్లో నటించింది. తెలుగులో గుండెజారి గల్లంతయ్యిందే, జనతా గ్యారేజ్, 100 డేస్ ఆఫ్ లవ్, ఒక్క అమ్మాయి తప్ప, ఇంకొక్కడు లాంటి చిత్రాల్లో నటించింది. ఇటీవల వెబ్ సిరీస్ లతో అలరించిన మలయాళీ భామ 36వ పుట్టినరోజును జరుపుకుంటోంది.
Nithya Menen Movie Updates
ఇటీవల సినిమాకు కాస్తా గ్యాప్ ఇచ్చి… వెబ్ సిరీస్ లపై దృష్టి సారించిన నిత్యామీనన్(Nithya Menen) తాజాగా తమిళ దర్శకురాలు కామిని దర్శకత్వంలో ‘డియర్ ఎక్సెస్’ నటిస్తున్నారు. ఈ సినిమాను బాస్క్ టైమ్ థియేటర్, పోప్టర్ మీడియా నెట్‌వర్క్ బ్యానర్‌లపై బీజీఎన్, ఆదిత్య అజయ్ సింగ్, రామ్కి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఫుల్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కించనున్న ఈ సినిమాలో వినయ్ రాయ్, నవదీప్, ప్రతీక్ బబ్బర్, దీపక్ పరంబోల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
అయితే సోమవారం నిత్యా మీనన్ బర్త్ డే సందర్భంగా ఆమె నటిస్తోన్న ‘డియర్ ఎక్సెస్’ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌లో నిత్యా ఒక చేతిలో మొబైల్… మరో చేతిలో గ్లాస్ పట్టుకుని కనిపించింది. ‘మ్యాజిక్ మొదలుకానుంది’ అనే వ్యాఖ్యతో విడుదల చేసిన ఫస్ట్ లుక్ ఆకట్టుకుంటుంది. ఇందులో చీరకట్టులో అందంగా ముస్తాబై ఒక చేతిలో డ్రింక్ మరోవైపు ఫోన్ పట్టుకుని సరికొత్త లుక్ లో కనిపిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది నిత్య. ప్రేమలో ఓడిపోయిన ఓ అమ్మాయి జీవితంలో ఎలాంటి సవాళ్లను ఎదుర్కొంది అన్న ఇతివృత్తంతో ఈ చిత్రం రూపొందుతోంది.
Also Read : Keerthy Suresh: వెబ్ సిరీస్ కోసం ’40 రోజులు వనవాసం’ చేసిన మహానటి !