Nithin: కొత్త వ్యాపారం మొదలుపెడుతున్న హీరో నితిన్ !

కొత్త వ్యాపారం మొదలుపెడుతున్న హీరో నితిన్ !

Nithin: ఏషియ‌న్ గ్రూప్ తో టాలీవుడ్ స్టార్ హీరోల రిలేష‌న్ షిప్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. సూప‌ర్ స్టార్ మ‌హేష్ ఏషియన్ సంస్థ భాగ‌స్వామ్యంలో ఏఎంబీ మాల్ ని నిర్మించారు. ఇది గ్రాండ్ స‌క్సెస్ అయింది. కొత్త‌గా బెంగుళూరులోనూ మ‌రో మ‌ల్టీప్లెక్స్ ని నిర్మిస్తున్నారు. అలాగే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఇదే గ్రూప్ తో అమీర్ పేట్ లో ఏఏఏ పేరుతో మ‌ల్టీప్లెక్స్ ని నిర్మించారు. వీళ్లిద్ద‌ర్నీ చూసి విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌వితేజ కూడా ముందుకొచ్చారు. మ‌హ‌బూబ్ న‌గ‌ర్ లో దేవ‌ర‌కొండ కూడా ఏషియ‌న్ స‌హ‌క‌రాంతో మల్టీప్లెక్స్ లోకి ఎంట‌ర్ అయ్యారు. ర‌వితేజ దిల్ సుఖ్ న‌గ‌ర్ లో ఏఆర్టీ మాల్ ని నిర్మించారు. త్వ‌ర‌లోనే ఇది ప్రారంభం కానుంది.

Nithin New Business

ఈ నేప‌థ్యంలో తాజాగా యూత్ స్టార్ నితిన్(Nithin) కూడా బిజినెస్ రంగంలోకి ఎంట‌ర్ అవుతున్నాడు. ఏషియ‌న్ గ్రూప్ తో సంగారెడ్డి లో ఏషియ‌న్ నితిన్ సితార ఓ మ‌ల్టీప్లెక్స్ ని నిర్మిస్తున్న సంగ‌తి ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. దానికి సంబంధించిన కొన్ని ఫోటోలు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి. ఇప్ప‌టికే నిర్మాణ ప‌నులు పూర్త‌యిన‌ట్లు తెలుస్తోంది. థియేట‌ర్ ని లైటింగ్ తో మిరుమిట్లు గొలిపి స్తున్నారు. అతి త్వరలోనే దీనిని ప్రారంభించబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు దీనిని త‌న అభిమాన హీరో ప‌వ‌న్ క‌ళ్యాణ్ చేతుల మీదుగా లాంచ్ చేసే ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఏపీ ఉప ముఖ్య‌మంత్రి హోదాలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ లాంచ్ చేస్తే మంచి మైలేజ్ వ‌స్తుంది. ఇప్ప‌టికే నితిన్ తండ్రి నిర్మాత‌గా, పంపిణీ రంగంలో రాణిస్తున్నారు. ఆ ప‌నుల‌న్నింటిని నితిన్ సోద‌రి చూసుకుంటున్నారు.

తాజాగా థియేట‌ర్ బిజినెస్ లోకి ఎంట‌ర్ అవుతున్నారు కాబ‌ట్టి ఆ బాద్య‌త‌లు కూడా ఆమె చూసుకునే అవ‌కాశం ఉంది. లేదంటే? ఆ బాధ్య‌త నితిన్(Nithin) భార్య‌కు అప్ప‌గించే అవ‌కాశం లేక‌పోలేదు. ఇంకా ఏషియ‌న్ గ్రూప్ తో క‌లిసి మ‌రిన్ని మ‌ల్టీప్లెక్స్ లు నిర్మించాల‌ని చాలా మంది హీరోలు వెయిట్ చేస్తున్నారు. మ‌హేష్, బ‌న్నీ లు వైజాగ్ లో కూడా మల్టీప్లెక్స్ ఏర్పాట్ల‌కు స‌న్నాహాలు చేస్తున్న‌ట్లు ఇప్ప‌టికే ప్ర‌చారంలో ఉంది.

Also Read : Aamir Khan: షూటింగ్ పూర్తి చేసుకున్న అమీర్ ఖాన్ ‘సితారే జమీన్‌ పర్‌’ !

Asian CinemasNithin
Comments (0)
Add Comment