Hero Nithin-Robinhood : నితిన్..శ్రీ‌లీల‌ రాబిన్ హుడ్ డేట్ క‌న్ ఫ‌ర్మ్ 

ప్ర‌క‌టించిన మూవీ మేక‌ర్స్ 

Nithin : వ‌ర్ద‌మాన న‌టుడు నితిన్ రెడ్డి న‌టించిన రాబిన్ హుడ్ పై భారీ అంచ‌నాలు ఉన్నాయి. ఈ సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా సాగుతోంది. ఎప్పుడు విడుద‌ల చేస్తార‌నే ఉత్కంఠ‌కు తెర దించే ప్ర‌య‌త్నం చేశారు మూవీ మేక‌ర్స్.

Hero Nithin Robinhood Movie Updates

ఈ మేర‌కు కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. వ‌చ్చే మార్చి 28న ప్ర‌పంచ వ్యాప్తంగా రాబిన్ హుడ్ చిత్రాన్ని విడుద‌ల చేయ‌నున్న‌ట్లు తెలిపారు. ఈ మూవీకి వెంకీ కుడుముల ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా మైత్రీ మూవీ మేక‌ర్స్ దీనిని నిర్మిస్తోంది ప్ర‌తిష్టాత్మ‌కంగా. తొలుత క్రిస్మ‌స్ పండుగ రోజు విడుద‌ల చేయాల‌ని భావించారు. కానీ అనివార్య కార‌ణాల రీత్యా రిలీజ్ డేట్ ను వాయిదా వేశారు.

మార్చి చివరిలో విడుదలకు ఈ వ్యూహాత్మక మార్పు రాబిన్‌హుడ్‌కు పోటీతత్వాన్ని ఇస్తుందని భావిస్తున్నారు, ఎందుకంటే ఆ వారం విడుదలకు ఇతర ప్రధాన చిత్రాలు ఏవీ లేవు. కొత్త తేదీ ప్రేక్షకుల ఓటింగ్‌ను పెంచుతుందని మేకర్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

ఈ చిత్రంలో నితిన్(Nithin) ప్రధాన పాత్రలో నటించగా, శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రానికి  జివి ప్రకాష్ కుమార్ సంగీతాన్ని సమకూర్చారు.

మ‌రో వైపు ఈ సినిమాపై ఎక్కువ న‌మ్మ‌కం పెట్టుకున్నారు న‌టీ న‌టులు నితిన్ రెడ్డి, శ్రీ‌లీల‌. త‌ను ఈమ‌ధ్య ఎక్కువ సినిమాలు చేయ‌డం లేదు నితిన్. మ‌రో వైపు శ్రీ‌లీల ఫుల్ బిజీగా మారారు. త‌ను పుష్ప‌-2 మూవీలో స్పెష‌ల్ సాంగ్ లో కనిపించింది. వ‌య్యారాలు ఒల‌క బోసింది.

విడుదల తేదీని నిర్ణయించడంతో, రాబిన్‌హుడ్ బృందం ప్రచార కార్యకలాపాలను ముమ్మరం చేస్తోంది. అభిమానులు సినిమా విడుదలకు దారితీసే అద్భుతమైన టీజర్‌లు, ట్రైలర్‌లు, ఈవెంట్‌ల కోసం ఎదురు చూస్తున్నారు.

Also Read : Beauty Trisha Movie : త్రిష కృష్ణ‌న్ ‘ఐడెంటిటీ’ రిలీజ్ కు రెడీ

CinemaNithinSree LeelaTrendingUpdates
Comments (0)
Add Comment