Robinhood : టాలీవుడ్ నుంచి రెండు సినిమాలు ఒకే రోజు విడుదలయ్యాయి. సితార ఎంటర్టైన్మెంట్ పతాకంపై నిర్మాత నాగవంశీ నిర్మించిన మ్యాడ్ స్క్వేర్ సీక్వెల్ మూవీ శనివారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇదే సమయంలో చాన్నాళ్ల గ్యాప్ తర్వాత నితిన్ రెడ్డి(Nithin), శ్రీలీల(Sree Leela) కలిసి నటించిన రాబిన్ హుడ్(Robinhood) రిలీజ్ అయ్యింది. ప్రస్తుతం మిశ్రమ స్పందన వస్తోంది ఈ చిత్రానికి. ఈ సినిమాపైనే ఆశలన్నీ పెట్టుకున్నాడు హీరో. ఇక శ్రీలీల గురించి చెప్పాల్సిన పని లేదు. తను సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారింది. నటనలోనూ, డ్యాన్సులతో ఇరగ దీసింది. తనతో నటించడం , పాటలకు డ్యాన్సులు చేయడం ఏ హీరోకైనా కష్టమేనని కితాబు ఇచ్చాడు ప్రముఖ స్టార్ హీరో ప్రిన్స్ మహేష్ బాబు.
Robinhood Movie Release Updates
రాబిన్ హుడ్ సినిమాకు వెంకీ కుడుముల దర్శకత్వం వహించాడు. తమిళ సినీ రంగానికి చెందిన ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందించాడు. ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్ టాప్ రేంజ్ లో కొనసాగుతున్నాయి. కెవ్వు కేక అనిపించేలా ఉన్నాయి. ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించారు. భారీ ఎత్తున ప్రచారం కూడా చేశారు. రాబిన్ హుడ్ లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు ప్రముఖ ఆస్ట్రేలియన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్. ఇక వరుస పరాజయాల పరంపరలో కొట్టుకు పోయాడు నితిన్ రెడ్డి.
దీంతో ఈ చిత్రం సక్సెస్ అవుతుందా లేదా అనే దానిపై ఆందోళనలో ఉన్నాడు. పూర్తిగా కామెడీ, సస్పెన్స్ తో తెరకెక్కించే ప్రయత్నం చేశానని చెప్పాడు దర్శకుడు వెంకీ కుడుముల. తనకు మినిమం గ్యారెంటీ దర్శకుడన్న పేరుంది. వాస్తవానికి మార్చి 25ననే ఈ చిత్రం రిలీజ్ కావాల్సి ఉంది. కానీ అనుకోకుండా 28కి మార్చారు. మరో వైపు నాగవంశీ పూర్తిగా నమ్మకంతో ఉన్నాడు తను నిర్మించిన మ్యాడ్ -2 సీక్వెల్ పై. పెట్టిన డబ్బులు తిరిగి వస్తాయని, అంతకు మించి బ్లాక్ బస్టర్ కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశాడు. మ్యాడ్ సినిమా కంటే రాబిన్ హుడ్ మూవీకి టికెట్లు తక్కువగా బుకింగ్ కావడం ఒకింత ఇబ్బందిగా మారింది. అయినా నిర్మాతలు మాత్రం పక్కా హిట్ అంటున్నారు.
Also Read : Mad Square Sensational :నవ్వుల నజరానా మ్యాడ్ స్క్వేర్ ఖజానా