Nithin : ప్రముఖ దర్శకుడు వక్కంతం వంశీ దర్శకత్వంలో నితిన్, శ్రీలీల జంటగా.. యాంగ్రీ యంగ్ మన్ రాజశేఖర్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఎ క్స్‌ట్రా – ఆర్డినరీ మేన్’. నితిన్(Nithin) హోం బ్యానర్ శ్రేష్ఠ్ మూవీస్‌పై సుధాకర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి హరీష్ జయరాజ్ సంగీతం అందిస్తుండగా… డిసెంబరు 8న రిలీజ్ కాబోతుంది. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వస్తోన్న ఈ సినిమా నుంచి విడుదల అయిన డేంజర్ పిల్లా, బ్రష్ వేసుకో పాటలకు మంచి స్పందన వస్తోంది. అయితే ఈ సినిమా షూటింగ్ కు సంబంధించి కీలక అప్ డేట్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ఈ సినిమా కోసం శంషాబాద్ లో నిర్మించిన ప్రత్యేక సెట్ లో హీరో నితిన్ మూడు వందలకు పైగా డ్యాన్సర్లతో ఓ పాటను తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది.
Nithin – జానీ మాస్టర్ కొరియోగ్రఫీలో 300 మంది విదేశీ డ్యాన్సర్లతో కలిసి స్టెప్పులేస్తున్న నితిన్
వినోదాత్మకంగా సాగే ఓ వినూత్న కథాంశంతో ఈ చిత్రం రూపొందుతోన్న ‘ఎ క్స్‌ట్రా – ఆర్డినరీ మేన్’ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. దీనితో శంషాబాద్‌లో వేసిన భారీ సెట్‌లో నితిన్ – శ్రీలీలపై ఓ మాస్ పాట చిత్రీకరిస్తున్నారు దర్శకుడు వక్కంతం వంశీ. జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తున్న ఈ పాటలో దాదాపు 300మందికి పైగా విదేశీడ్యాన్సర్లతో కలిసి నితిన్, శ్రీలీల స్టెప్పులు వేసారని తెలుస్తోంది. అసలే జానీ మాస్టర్… ఆపైన నితిన్, శ్రీలీల దీనితో ఈ పాటలో మాస్ స్టెప్పులకు కొదువ ఉండదు అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
Also Read : Siddu Jonnalagadda: డిజే టిల్లుతో జోడీ కడుతున్న బేబీ బ్యూటీ