Nithin: తండ్రిగా ప్రమోషన్ పొందిన టాలీవుడ్ యంగ్ హీరో నితిన్‌ !

తండ్రిగా ప్రమోషన్ పొందిన టాలీవుడ్ యంగ్ హీరో నితిన్‌ !

Nithin: టాలీవుడ్‌ యంగ్ హీరో నితిన్‌ తండ్రిగా ప్రమోషన్ పొందారు. ఆయన భార్య షాలిని పండంటి మగబ్డికు జన్మనిచ్చింది. ఇదే విషయాన్ని నితిన్‌ తన సోషల్‌ మీడియా వేదికగా తెలిపారు. చిన్నారి చెయ్యి ఫొటోను పంచుకుంటూ… ‘మా ఫ్యామిలీ న్యూ స్ట్టార్‌కు ఆహ్వానం’ అని నితిన్‌ క్యాప్షన్‌ పెట్టారు. దీనితో సినీ ప్రముఖులతో పాటు అభిమానులు నితిన్ దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. పవన్ కళ్యాణ్ వీరాభిమానిని అని నితిన్(Nithin) గతంలో అనేకసార్లు చెప్పుకోవడంతో తన కుమారుడికి ఏం పేరు పెడతారు అనేదానిపై నెటిజన్లు చర్చించుకుంటున్నారు.

Nithin Blessed with Baby Boy

జూలై 16, 2020లో నితిన్‌, షాలిని వివాహం జరిగింది. కొద్దిరోజుల క్రితమే ఈ జంట తల్లిదండ్రులుగా మారబోతున్నారని వార్తలొచ్చాయి. అయితే తాజాగా షాలిని పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. తల్లి, బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారని నితిన్‌ తెలిపారు. దీనితో తమ అభిమాన హీరో తండ్రిగా మారడంతో నితిన్‌ ఫ్యాన్స్‌ ఆయనకు సోషల్‌ మీడియా వేదికగా శుభాక్షాంక్షలు తెలుపుతున్నారు. నితిన్‌ ప్రస్తుతం వెంకీ కుడుముల దర్శకత్వంలో రాబిన్‌హుడ్‌ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాను త్వరలోనే రిలీజ్‌ చేసేందుకు మేకర్స్‌ సిద్థమవుతున్నారు.

Also Read : Tollywood: వరద బాధితుల సహాయానికి టాలీవుడ్ నుండి ప్రత్యేక కమిటీ !

NithinRobinhoodvenky kudumula
Comments (0)
Add Comment