Miss India 2024 : ఫెమినా మిస్ ఇండియా 2024 విజేతగా ‘నిఖితా పోర్వల్’

ఈ ఏడాది ‘మిస్ ఇండియా వరల్డ్’ పోటీలను ముంబైలో నిర్వహించారు...

Miss India 2024 : ముంబైలో జరిగిన ఫెమినా మిస్ ఇండియా గ్రాండ్ ఫినాలేలో మధ్యప్రదేశ్‌కు చెందిన నికితా పోర్వాల్ ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ 2024 కిరీటాన్ని కైవసం చేసుకుంది. తద్వారా కేంద్ర పాలిత ప్రాంతాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న రేఖా పాండే రన్నరప్‌గా నిలిచింది. మిస్ ఇండియా టైటిల్ గెలుచుకున్న నికితా పోర్వాల్(Nikita Porwal) ఎవరు? మరి ఈమె విజయ దశకు ఎలా చేరుకుందో తెలుసుకుందాం… మధ్యప్రదేశ్‌కు చెందిన నికితా పోర్వాల్ ఈ సంవత్సరం ‘మిస్ ఇండియా’ గౌరవాన్ని గెలుచుకుంది. నికితా పోర్వాల్ 18 ఏళ్ల వయసులో టీవీ యాంకర్‌గా తన కెరీర్‌ను ప్రారంభించింది. ఆ తర్వాత నటన రంగం వైపు మళ్లింది.

ఇప్పటి వరకు 60కి పైగా నాటకాల్లో నటించింది. అంతే కాదు 250 పేజీల ‘కృష్ణ లీల’ నాటకాన్ని కూడా రాసింది. ఇది కాకుండా నికితా నటించిన సినిమా ఒకటి ఇంటర్నేషనల్ ఫెస్టివల్స్ లో ప్రదర్శింపబడగా త్వరలో ఈ సినిమా ఇండియాలో కూడా విడుదల కానుంది. తన అందం, తెలివితేటలతో ఈ ప్రతిష్టాత్మక పోటీలో విజేత కిరీటం గెలుచుకున్నందుకు నికితా కుటుంబం చాలా గర్వపడుతోంది. కాగా, ఈ పోటీలో మొదటి రన్నరప్‌గా రేఖ పాండే, రెండో రన్నరప్‌గా ఆయుషి ధోలాకియా నిలిచారు.

Miss India 2024 Updates

ఈ ఏడాది ‘మిస్ ఇండియా వరల్డ్’ పోటీలను ముంబైలో నిర్వహించారు. మిస్ ఇండియా 2023 నందిని గుప్తా కిరీటాన్ని నికితా తలపై ఉంచారు. దీనికి సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముంబైలో జరిగిన ఈ వేడుకలో సంగీతా బిజ్లానీ ర్యాంప్ వాక్ చేసింది. మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో నివసిస్తున్న నికితి పోర్వాల్(Nikita Porwal) పెట్రో కెమికల్ వ్యాపారి అశోక్ పోర్వాల్ కుమార్తె. ఆమె బ్యాచిలర్ ఆఫ్ పెర్ఫార్మింగ్‌లో పట్టా పొందారు. కాలేజీలో చదువుతున్నప్పుడు ఆమెకు నాటకాలంటే చాలా ఇష్టం. నికితాకి ఇప్పటికీ చదవడం, రాయడం, పెయింటింగ్ వేయడం, సినిమాలు చూడటం చాలా ఇష్టం. నికితాలో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఆమె సోషల్ మీడియాలో అంతగా యాక్టివ్‌గా ఉండరు. మిస్ ఇండియాగా గెలవకముందు ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో 5 వేల మంది ఫాలోవర్లు మాత్రమే ఉన్నారు. కానీ, ఇంత చిన్న వయసులో ఎంతో కష్టపడి ఈ స్థాయికి చేరుకుంది. ఓ సాధారణ అమ్మాయి నుంచి నటనలో కెరీర్ ప్రారంభించి మిస్ ఇండియా వరకు… వేలాది మంది అమ్మాయిలకు నికిత ప్రయాణం స్ఫూర్తిదాయకంగా మారనుంది.

Also Read : Bagheera Movie : ప్రశాంత్ నీల్ కథ అందించిన ‘బఘీర’ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్

2024Miss IndiaTrendingUpdatesViral
Comments (0)
Add Comment