Nikhil Siddharth: టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ త్వరలోనే తండ్రి కాబోతున్నారు. తాజాగా ఆయన భార్య డాక్టర్ పల్లవి వర్మకు సీమంతం వేడుక నిర్వహించారు. ఈ విషయాన్ని నిఖిల్ తన ట్విటర్ ద్వారా పంచుకున్నారు. సీమంతం వేడుకలో తన భార్యతో దిగిన ఫోటోను షేర్ చేశారు. 2020లో డాక్టర్ పల్లవి వర్మను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు నిఖిల్(Nikhil Siddharth). మూడేళ్ళు తిరగకముందే నిఖిల్ తండ్రి కాబోతున్నాడు. ఈ సందర్భంగా నిఖిల్ తన ట్విటర్‌లో రాస్తూ… ‘నా భార్యకు భారతీయ సంప్రదాయంలో సీమంతం వేడుక జరిగింది.
పల్లవి, నేను త్వరలోనే మా మొదటి బిడ్డ స్వాగతం పలకబోతున్నాం. ఈ విషయాన్ని ప్రకటించడానికి మేము చాలా సంతోషిస్తున్నాం. దయచేసి మాకు పుట్టబోయే బిడ్డకు మీ అందరి ఆశీస్సులు పంపండి.’ అంటూ పోస్ట్ చేశారు. ఇది చూసిన నిఖిల్ అభిమానులు తమ హీరోకు అభినందనలు తెలుపుతున్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Nikhil Siddharth Viral
‘హ్యాపీడేస్’ సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన యంగ్ హీరో నిఖిల్. ‘కార్తికేయ’, ‘కార్తికేయ 2’తో పాన్ ఇండియా లెవెల్లో గుర్తింపు పొందారు. ప్రస్తుతం ఆయన ‘స్వయంభూ’ సినిమాలో నటిస్తున్నారు. చారిత్రాత్మక నేపథ్యంలో సాగే ఈ సినిమాలో హీరో నిఖిల్ ఓ వారియర్ పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా కోసం దాదాపు మూడు నెలలపాటు యుద్ధవిద్యలపైనే నిఖిల్ శిక్షణ తీసుకున్నారు.
Also Read : Pawan Kalyan Movie : రీ రిలీజ్ కు సిద్ధమవుతున్న పవర్ స్టార్ ప్లాప్ సినిమా