Niharika Konidela: సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టిన మెగా డాటర్

సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టిన మెగా డాటర్

Niharika Konidela: ‘ఒక మనసు’, ‘హ్యాపీ వెడ్డింగ్‌’, ‘సూర్యకాంతం’ లాంటి చిత్రాలతో ప్రేక్షకులకు దగ్గరైన మెగా డాటర్ నిహారిక కొణిదెల… పెళ్ళి తరువాత నటనకు గుడ్ బై చెప్పి నిర్మాతగా మారింది. అయితే అనూహ్య పరిణామాల మధ్య ఆమె తన భర్త చైతన్య జొన్నలగడ్డతో విడాకులు తీసుకోవడంతో మరల ఆమె నటనపై దృష్టి పెట్టింది. డెడ్‌ పిక్సెల్స్‌ అనే వెబ్‌ సిరీస్‌లో నటించిన నిహారిక… తాజాగా ‘వెన్ ది క్రేజీ బికమ్స్‌ క్రేజియర్‌’ అనే ట్యాగ్ లైన్ తో వస్తున్న ‘వాట్‌ ది ఫిష్‌’ సినిమాతో సిల్వర్ స్రీన్ పై మెరవడానికి సిద్ధం అయింది.

Niharika Konidela Movie Updates

6 ఐఎక్స్‌ సినిమాస్‌పై విశాల్‌ బెజవాడ, సూర్య బెజవాడ నిర్మిస్తున్నన ఈ సినిమాతో వరుణ్‌ కోరుకొండ దర్శకుడిగా పరిచయం కానున్నారు. దీనితో నిహారిక బర్త్ డే సందర్భంగా ‘వాట్‌ ది ఫిష్‌’ ఫస్ట్ లుక్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ ఫస్ట్ లుక్ లో ఆమె అల్ట్రామోడన్‌ లుక్‌లో కనిపించగా.. బ్యాగ్రౌండ్‌లో డాలర్‌ సింబల్‌ ఉంది. దీనితో నిహారిక(Niharika Konidela) ఈ సినిమాలో అష్టలక్ష్మి అనే పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. నటన, యాక్షన్‌కు ప్రాధాన్యమున్న ఈ సినిమా అత్యుత్తమ సాంకేతిక ప్రమాణాలతో భారీ స్థాయిలో పాన్‌ ఇండియాతో పాటు ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ప్రస్తుతం ‘వాట్‌ ది ఫిష్‌’ ఫస్ట్ లుక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో… మెగా డాటర్ కు ఆల్ ది బెస్ట్ చెప్తున్నారు అభిమానులు.

Also Read : Sampoornesh Babu: ‘నన్ను చూసినావే పిల్ల’ అంటూ వెంటపడుతున్న సంపూర్ణేష్

megastarNiharika Konidela
Comments (0)
Add Comment