Niharika Konidela : బాబాయిపై ఉన్న ప్రేమను మరోసారి బయటపెట్టిన నిహారిక

షార్ట్‌ ఫిల్మ్స్‌తో కెరీర్‌ ప్రారంభించిన నిహారిక వెండితెరపై హీరోయినగా మెరిసింది...

Niharika Konidela : మెగా డాటర్‌ నిహారిక కొణిదెల బాబాయ్‌ పవన్ కళ్యాణ్ పై ఉన్న ప్రేమను మరోసారి బయటపెట్టింది. ప్రస్తుతం సినిమాలు, సిరీస్‌లు, అలాగే నిర్మాతగా బిజీగా ఉన్నారామె. ప్రస్తుతం తాజాగా ‘కమిటీ కుర్రాళ్లు’ అనే నిర్మించారు. ఆ సినిమా ప్రమోషన్లో ఆహా ఓటీటీ సంస్థ నిర్వహిస్తున్న సర్కార్‌ సక్సెస్‌ సెలబ్రేషన్లో పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన ప్రోమో విడుదల చేశారు. ఈ ప్రోమోలో ఆమె పవన్‌ కళ్యాణ్‌ గురించి మాట్లాడారు. ” నేను ఎప్పుడు వచ్చేది నెక్స్ట్‌ సీజనా.? అని నిహారిక అడగగా ఆ షోకి హోస్ట్‌గా వ్యవహరిస్తున్న సుడిగాలి సుధీర్‌ మీకేంటండి.. ‘ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎం గారి తాలుకా’ అని అన్నాడు.

దాంతో పవన్‌ కళ్యాణ్‌ గెలిచిన తర్వాత చిరంజీవి ఇంటికి వెళ్లి ఆయన ఆశీర్వాదం తీసుకున్న వీడియోను ప్లే చేశారు. కల్యాణ్‌గారి సక్సెస్‌ చూస్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది అని అడగగా “యుద్థం గెలిచిన తర్వాత రాముడు అయోధ్యకు వచ్చినప్పుడు ఇలానే ఉన్నదేమో అనిపించింది” అని నిహారికా అన్నారు. పవన్‌ కళ్యాణ్‌ ను నిహారిక(Niharika Konidela) రాముడితో పోల్చడంతో ఫ్యాన్స్‌ ఫుల్‌ ఖుష్‌ అవుతున్నారు. ప్రస్తుతం నిహారిక మాటలు నెట్టింట విపరీతంగా వైరల్‌ అవుతున్నాయి. పవన్ గెలుపు తర్వాత చిరంజీవి ఇంటికి వెళ్లి ఆయన పాదాలకు నమస్కరించిన వీడియో అందరినీ ఆకట్టుకుంది. ఎంతోమంది ఆ వీడియో చూసి భావోద్వేగానికి లోనయ్యారు. దేశ ప్రధాని మోదీ సైతం దాని గురించి ప్రస్తావించిన సంగతి తెలిసిందే.

Niharika Konidela Comment

షార్ట్‌ ఫిల్మ్స్‌తో కెరీర్‌ ప్రారంభించిన నిహారిక(Niharika Konidela) వెండితెరపై హీరోయినగా మెరిసింది. నాగ శౌర్య హీరోగా నటించిన ‘ఒక మనసు’ అనే సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. తర్వాత ‘నాన్న కూచి’ అనే వెబ్‌ సిరీస్‌ చేసింది. హ్యపి వెడ్డ్డింగ్‌తోపాటు తమిళంలో ఓ సినిమా చేసింది. చిరంజీవి సైరా నరసింహారెడ్డి చిన్న పాత్ర చేసింది. సూర్యకాంతం తర్వాత హీరోయిన్ గా సినిమా చేయలేదు. అనే సినిమాలో కనిపించింది. ప్రస్తుతం కమిటీ కుర్రాళ్ళు అనే సినిమా చేస్తున్నారు నిహారిక. ఈ సినిమా ప్రమోషన్స్‌ లో బిజీ బిజీగా ఉన్నారు.

Also Read : Indra Re-Release: మెగాస్టార్ చిరంజీవి బర్త్‌డే స్పెషల్‌ గా ‘ఇంద్ర’ రీ రిలీజ్ !

Comments (0)
Add Comment