Beauty Niharika Movie :ఆహాలో నిహారిక కొణిద‌ల మూవీ 

త‌మిళంలో వ‌చ్చిన మ‌ద్రాస్కార‌ణ్ 

Niharika : మెగా ఫ్యామిలీకి చెందిన నిహారిక కొణిద‌ల(Niharika) ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచారు. త‌ను బుల్లితెరతో పాటు వెండి తెర‌పై కూడా ఫోక‌స్ పెట్టింది. న‌ట‌న‌కు ప్రాధాన్య‌త ఉండేలా జాగ్ర‌త్త ప‌డుతోంది. త‌మిళంలో మ‌ద్రాస్కార‌ణ్ పేరుతో తీసిన మూవీలో కీల‌క పాత్ర‌లో న‌టించింది. ఈ ఏడాది సంక్రాంతి ప‌ర్వ‌దినం సంద‌ర్బంగా దీనిని విడుద‌ల చేశారు. మిక్స్ డ్ టాక్ తెచ్చుకుంది.

Niharika Konidela Movie at Aha..

ఈ మూవీలో నిహారిక కొణిద‌లతో పాటు క‌లైయ రాస‌న్ , ఐశ్వ‌ర్య ద‌త్తా, షేన్ నిగ‌మ్ , త‌దిత‌ర పాత్ర‌ల్లో న‌టించారు. వాలి మోహ‌న్ దాస్ ద‌ర్శ‌క‌త్వం చేప‌ట్టారు. ఎలాంటి ప్ర‌చారం లేకుండానే విడుద‌లైన  మ‌ద్రాస్కార‌ణ్ రూ.80 ల‌క్ష‌లు వ‌సూలు చేయ‌డం విశేషం. ఆశించిన మేర ఆడ‌లేక పోయింది.

కాగా మ‌ద్రాస్కార‌ణ్ త‌మిళ వెర్ష‌న్ లో ఓటీటీలోకి వ‌చ్చేసింది. ప్ర‌స్తుతం దీనిని తెలుగు వెర్ష‌న్ లో ఆహాలో ప్రేక్ష‌కుల కోసం స్ట్రీమింగ్ అవుతోంది. డిఫ‌రెంట్ గా ఆలోచించే వారికి , భిన్న‌మైన సినిమాల‌ను కోరుకునే వారికి ఈ చిత్రం త‌ప్ప‌క న‌చ్చుతుంద‌ని అంటోంది ముద్దుగుమ్మ నిహారిక కొణిద‌ల‌. మ‌హా శివ రాత్రి ప‌ర్వ‌దినం సంద‌ర్బంగా అల‌రించ‌నుంది. ఇందుకు సంబంధించి కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది ఆహా సంస్థ‌.

Also Read : Mazaka Super :మ‌జాకా కెవ్వు కేక న‌వ్వుల పండుగ

CinemaNiharika KonidelaOTTTrendingUpdates
Comments (0)
Add Comment