Nidhhi Agerwal Shocking :నో డేటింగ్ పై నిధి అగ‌ర్వాల్ షాకింగ్ కామెంట్స్

మున్నా మైకేల్ మూవీపై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు

Nidhhi Agerwal : సినీ న‌టి నిధి అగ‌ర్వాల్ ఈ మ‌ధ్య‌న చ‌ర్చ‌నీయాంశంగా మారారు. త‌ను కూడా బెట్టింగ్ యాప్స్ ప్ర‌మోష‌న్ చేసినందుకు గాను కేసును ఎదుర్కొంటోంది. ఆమెతో పాటు 25 మంది విచార‌ణ‌కు హాజ‌రు కానున్నారు. ఇప్ప‌టికే కొంద‌రు హాజ‌ర‌య్యారు. త‌ను ఇప్పుడు స్టార్ హీరో, ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ కొణిదెల‌తో హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు మూవీలో కీ రోల్ పోషిస్తోంది. ఇప్ప‌టికే ప‌వ‌ర్ స్టార్ తో క‌లిసి ఓ సాంగ్ లో త‌ళుక్కున మెరిసింది. దీంతో ఈ అమ్మ‌డు మురిసి పోతోంది. ప‌వ‌న్ తో న‌టించ‌డంతో దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.

Nidhhi Agerwal Shocking Comments

త‌ను గ‌తంలో బాలీవుడ్ నుంచి స‌వ్య‌సాచి చిత్రం ద్వారా తెలుగు తెర‌లో ఎంట్రీ ఇచ్చింది. ఆ త‌ర్వాత డైన‌మిక్ డైరెక్ట‌ర్ నిధి అగ‌ర్వాల్(Nidhhi Agerwal) క‌ళ్ల‌ల్లో ప‌డింది. వెంట‌నే మ‌నోడు రామ్ పోతినేని న‌టించిన బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ ఇస్మార్ట్ శంక‌ర్ లో ఠ‌క్కున తీసుకున్నాడు. దీంతో త‌న ద‌శ తిరిగింది. చాలా సినిమాల‌లో అవ‌కాశాలు రావ‌డం మొద‌లు పెట్టాయి. అయితే త‌ను కెరీర్ ప‌రంగా బాలీవుడ్ లో స్టార్ట్ చేసింది. ఈ సంద‌ర్బంగా చిట్ చాట్ చేసింది నిధి అగ‌ర్వాల్.

ఆ చిత్రం పేరు మున్నా మైకేల్. ఇందులో ప్ర‌ముఖ న‌టుడు జాకీ ష్రాఫ్ త‌న‌యుడు టైగ‌ర్ ష్రాఫ్ . ఈ సంద‌ర్బంగా కాంట్రాక్టు కుదుర్చుకునే స‌మ‌యంలో ఓ వింత అనుభ‌వాన్ని ఎదుర్కొన్నాన‌ని చెప్పింది. ఇందులో నో డేటింగ్ అని కూడా ఉంద‌ని, తాను చ‌ద‌వ‌కుండానే సంత‌కం చేశాన‌ని తెలిపింది. సినిమా షూటింగ్ పూర్త‌య్యేంత వ‌ర‌కు హీరోతో డేటింగ్ కుద‌ర‌ద‌ని, దీని వ‌ల్ల సినిమా షూటింగ్ కు ఇబ్బంది ఏర్ప‌డుతుంద‌ని , అందుకే తాను ఆలోచించి ఓకే చెప్పాన‌ని స్ప‌ష్టం చేసింది నిధి అగ‌ర్వాల్.

Also Read : Hero Sunny Deol-Randeep :సన్నీషేక్ ర‌ణ‌దీప్ రాక్ ‘జాట్’ ఝ‌ల‌క్

CommentsNiddhi AgarwalShockingViral
Comments (0)
Add Comment