Beauty Nidhhi Agerwal : ఆ మూవీపై ముద్దుగుమ్మ కామెంట్స్

రాజా సాబ్ లో అద్బుత‌మైన పాత్ర

Nidhhi Agerwal : క‌న్న‌డ ముద్దుగుమ్మ నిధి అగ‌ర్వాల్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. త‌ను ప‌లు సినిమాల‌లో న‌టిస్తూ బిజీగా మారింది. ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో త‌ను స్టార్ హీరోల‌తో న‌టిస్తుండ‌డం విశేషం. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టిస్తున్న హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు మూవీలో, మారుతి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న రొమాంటిక్ మూవీ రాజా సాబ్ చిత్రంలో డార్లింగ్ ప్ర‌భాస్ స‌ర‌స‌న న‌టిస్తోంది నిధి అగ‌ర్వాల్(Niddhi Agerwal).

Nidhhi Agerwal Comment

ఈ రెండు సినిమాలు శ‌ర వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్నాయి. ఈ సంద‌ర్బంగా ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది న‌టి నిధి అగ‌ర్వాల్. రాజా సాబ్ త‌న కెరీర్ లో మ‌రిచి పోలేనిదిగా ఉండ‌బోతోందంటూ పేర్కొంది. త‌ను ఊహించ లేద‌న్నారు.

త‌న ఇమేజ్ ఈ రెండు సినిమాల‌తో ఓ రేంజ్ లోకి వెళ్ల‌డం ఖాయ‌మ‌న్నారు. త‌ను ప్ర‌స్తుతం అన్ని వ‌ర్గాల‌ను ఆక‌ట్టుకునేలా పాత్ర‌ల‌ను ఎంచుకుంటున్న‌ట్లు తెలిపారు. ప్ర‌స్తుతానికి రాజా సాబ్ మూవీలో గ్లామ‌ర్ పాత్ర‌ల‌కు భిన్నంగా ఉంటుంద‌న్నారు నిధి అగ‌ర్వాల్. ఈ ఒక్క మూవీ త‌న ఇమేజ్ ను మ‌రింత పెంచేలా చేస్తుంద‌న్న న‌మ్మ‌కాన్ని వ్య‌క్తం చేశారు.

అయితే రాజా సాబ్ క‌థ గురించి తాను ఇప్పుడే చెప్ప‌లేన‌ని పేర్కొంది. ఇదిలా ఉండ‌గా హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు, రాజా సాబ్ చిత్రాలపై మ‌రింత ఆస‌క్తిని, ఉత్కంఠ‌ను రేపుతున్నాయి.

Also Read : Hero Mithun – The Delhi Files : ‘ది ఢిల్లీ ఫైల్స్’ టీజ‌ర్ విడుద‌ల

CommentsNiddhi AgarwalTrendingViral
Comments (0)
Add Comment