Nidhhi Agerwal : ఒకే రోజు రెండు సినిమాలతో రానున్న హీరోయిన్ నిధి అగర్వాల్’

డబుల్ ఇస్మార్ట్ సినిమాలో నిధి అందాలకు కుర్రకారు ఫిదా అయ్యారు...

Nidhhi Agerwal : నిధి అగర్వాల్.. మంది భామలు బాలీవుడ్ నుంచి వచ్చి టాలీవుడ్ లో సక్సెస్ అయ్యారు.. వారిలో నిధి ఒకరు. ఈ ముద్దుగుమ్మ తన అందంతో కుర్రకారును కట్టిపడేసింది. అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్య హీరోగా నటించిన సవ్యసాచి సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యింది నిధి(Nidhhi Agerwal). భారీ అంచనాల మధ్య విడుదలైన ఆ సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఆతర్వాత అక్కినేని అఖిల్ తో మజ్ను అనే సినిమా చేసింది. ఆ సినిమా కూడా నిరాశపరిచింది. దాంతో ఈ బ్యూటీకి ఇక అవకాశాలు రావడం కష్టమే అని అనుకున్నారు అంతా.. ఆతర్వాత డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కించిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో హిట్ అందుకుంది. ఇక ఈ సినిమాలో నటనతో పాటు గ్లామర్ పరంగాను ఆకట్టుకుంది.

Nidhhi Agerwal Movie Updates

డబుల్ ఇస్మార్ట్ సినిమాలో నిధి అందాలకు కుర్రకారు ఫిదా అయ్యారు. ఈ సినిమా హిట్ అయినా కూడా నిధి(Nidhhi Agerwal)కి అంతగా ఆఫర్స్ రాలేదు. మహేష్ బాబు ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో అశోక్ గల్లా నటించిన హీరో అనే సినిమా చేసింది. ఇక ఇప్పుడు ఈ భామ వరుసగా రెండు భారీ సినిమాలు చేస్తోంది. కెరీర్ ఖతం అయ్యింది అని అనుకునేలోగా ఇద్దరూ బడా స్టార్స్ సినిమాలో ఛాన్స్ అందుకుంది. నిధి అగర్వాల్ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న హరిహరవీరమల్లు సినిమాలో హీరోయిన్ గా చేస్తోంది. అలాగే ప్రభాస్ మారుతి దర్శకత్వంలో వస్తున్న రాజా సాబ్ సినిమాలోనూ నటిస్తుంది.

తాజాగా ఈ రెండు సినిమాల్లో నటించడం గురించి తాజాగా నిధి అగర్వాల్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ప్రపంచమంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న రెండు పాన్‌ ఇండియా సినిమాలు.. ‘హరిహరవీరమల్లు’ , ‘రాజా సాబ్‌’లలో నేను నటిస్తున్నందుకు సంతోషంగా ఉంది. ఒకేరోజు ఈ రెండు సినిమాల షూటింగ్స్ లో పాల్గొనడం మరింత ఆనందంగా ఉంది. అది కూడా ఒక సినిమా షూటింగ్‌ ఆంధ్రాలో, మరొకటి తెలంగాణలో జరుగుతుంది. ఈ రెండు సినిమాలు ఖచ్చితంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి అని సోషల్ మీడియాలో రాసుకోచ్చింది నిధి. దాంతో ప్రభాస్, పవన్ అభిమానులు ఫుల్ ఖుష్ అవుతున్నారు.

Also Read : Ram Charan : ఓ చిన్నారికి ప్రాణదాతగా నిలిచిన రామ్ చరణ్

MoviesNidhhi AgerwalTrendingUpdatesViral
Comments (0)
Add Comment