Varalaxmi Sharath Kumar : ప్రముఖ తమిళ సినీ నటి వరలక్ష్మీ శరత్ కుమార్ కు కోలుకోలేని షాక్ తగిలింది. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) సమన్లు జారీ చేసింది. కేరళ డ్రగ్స్ కేసులో భాగంగా వరలక్ష్మీ శరత్ కుమార్ ను విచారించేందుకు ఆమెకు కేంద్ర దర్యాప్తు సంస్థ సమన్లు ఇచ్చింది.
Varalaxmi Sharath Kumar Viral
ఈ కేసులో వరలక్ష్మి శరత్ కుమార్ మాజీ పర్సనల్ అసిస్టెంట్ ఆది లింగం కీలక నిందితుడిగా ఉన్నాడు. దీంతో అతడి వివరాలను సేకరించేందుకు వరలక్ష్మి శరత్ కుమార్(Varalaxmi Sharath Kumar) ను విచారించేందుకు రావాలని ఎన్ఐఏ ఆదేశించింది.
కేరళలోని వియిన్యం సముద్ర తీరం వద్ద ఆగస్టు 18న భారీ ఎత్తున మాదక ద్రవ్యాలు, మారణాయుధాలను ఎన్ఐఏ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. శ్రీ విఘ్నేష్ అనే పేరుతో ఉన్న ఫిషింగ్ బోట్ నుంచి 300 కేజీల హెరాయిన్, ఒక ఏకే 47 రైఫిల్, 17 రౌండ్ల బుల్లెట్లు, ఐదు 9ఎంఎం పిస్తోళ్లు స్వాధీనం చేసుకున్నారు.
దొరికిన హెరాయిన్ విలువ రూ.2,100 కోట్లు ఉంటుందని అంచనా. ఈ కేసులో వరలక్ష్మి శరత్ కుమార్ మాజీ పర్సనల్ అసిస్టెంట్ ఆద లింగం కీలకమైన వ్యక్తిగా ఉన్నారు.
Also Read : Rajinikanth Visit : జయనగర్ బస్ డిపోలో రజనీకాంత్