Game Changer: ‘గేమ్‌ ఛేంజర్‌’ పై కీలక అప్‌డేట్‌ ఇచ్చిన శంకర్‌ !

‘గేమ్‌ ఛేంజర్‌’ పై కీలక అప్‌డేట్‌ ఇచ్చిన శంకర్‌ !

Game Changer: గ్లోబల్ స్టార్ రామ్‌ చరణ్, ప్రముఖ దర్శకుడు శంకర్‌ కాంబోలో తెరకెక్కుతోన్న తాజా సినిమా ‘గేమ్ ఛేంజర్‌’. ఈ సినిమా నుంచి అప్‌డేట్‌ వచ్చి చాలా రోజులవుతోంది. ‘గేమ్ ఛేంజర్‌’ సినిమాకు సంబంధించి సింహాభాగం షూటింగ్ ను పూర్తి చేసిన దర్శకుడు శంకర్… ప్రస్తుతం కమల్ హాసన్ తో తెరకెక్కించిన ‘ఇండియన్‌ 2’ ప్రమోషన్‌లో బిజీగా ఉన్నాడు. అయితే ఇటీవల ఓ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వూలో దర్శకుడు శంకర్‌ ‘గేమ్ ఛేంజర్‌(Game Changer)’ పై కీలకమైన అప్‌డేట్‌ ఇచ్చారు.

Game Changer Updates

ఓ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వూలో దర్శకుడు శంకర్ మాట్లాడుతూ… ‘‘సినిమా షూటింగ్‌ దాదాపు పూర్తయింది. ఇంకా 10 రోజుల చిత్రీకరణ మాత్రమే మిగిలిఉంది. ‘ఇండియన్‌ 2’ రిలీజ్‌ కాగానే ‘గేమ్ ఛేంజర్‌(Game Changer)’ ప్రొడక్షన్‌ పనులు పూర్తి చేస్తాను. ఆ తర్వాత ఫైనల్‌ ఫుటేజ్‌ చూసి పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు ప్రారంభిస్తాను. అన్ని పనులు పూర్తయిన తర్వాత రిలీజ్‌పై ఓ నిర్ణయం తీసుకుంటా. సాధ్యమైనంతవరకు త్వరగానే రిలీజ్ చేయడానికి ప్రయత్నిస్తా’ అని శంకర్‌ చెప్పారు. అలాగే హీరో సిద్ధార్థ్‌ మాట్లాడుతూ… శంకర్‌ ఓ సినిమాలో 2000 మందితో సన్నివేశాలు చిత్రీకరించారు. అవి అద్భుతంగా ఉన్నాయని అన్నారు. దీంతో సిద్ధార్థ్‌ చెప్పింది ‘గేమ్ ఛేంజర్‌’ గురించేనని రామ్‌చరణ్‌ అభిమానులు భావిస్తున్నారు.

శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్‌ బ్యానర్‌పై దిల్‌రాజు నిర్మాతగా రామ్‌ చరణ్‌, కియారా అద్వానీ హీరోహీరోయిన్లుగా ప్రముఖ దర్శకుడు శంకర్‌ తెరకెక్కిస్తోన్న చిత్రం ‘గేమ్‌ ఛేంజర్‌’. పొలిటికల్‌ యాక్షన్ థ్రిల్లర్‌ గా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో అంజలి, శ్రీకాంత్‌, సునీల్‌, ఎస్‌.జె.సూర్య, సముద్రఖని, నవీన్‌ చంద్ర కీలక పాత్రలు పోషించగా… ఎస్.ఎస్. థమన్‌ సంగీతం అందిస్తున్నాడు. ప్రముఖ కోలీవుడ్ దర్శకుడు, రచయిత కార్తిక్‌ సుబ్బరాజ్‌ అందించిన పొలిటికల్‌, యాక్షన్‌ కథను ‘గేమ్‌ ఛేంజర్‌’ గా శంకర్ తెరకెక్కిస్తున్నారు. దీనితో ఈ సినిమా విడుదల కోసం మెగా ఫ్యామిలీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే విడుదల చేసిన టైటిల్ లుక్, ఫస్ట్ లుక్ కు మెగా అభిమానులతో పాటు శంకర్ అభిమానుల నుండి విశేషమైన స్పందన వచ్చింది.

Also Read : Prince Narula: ప్రేమ, పెళ్లి, ప్రెగ్నెన్సీ ప్రకటించిన బాలీవుడ్ బిగ్‌ బాస్‌ కపుల్స్ !

game changerram charan
Comments (0)
Add Comment