Gopichand: ఆకట్టుకుంటోన్న గోపీచంద్ ‘భీమా’ సాంగ్ !

ఆకట్టుకుంటోన్న గోపీచంద్ 'భీమా' సాంగ్ !

Gopichand: టాలీవుడ్ మ్యాచో స్టార్ గోపీచంద్ హీరోగా కన్నడ దర్శకుడు ఏ హర్ష దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న సినిమా ‘భీమా’. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కెకె రాధామోహన్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ లో గోపీచంద్(Gopichand) సరసన ప్రియా భవానీ శంకర్, మాళవిక శర్మ హీరోయిన్లుగా నటిస్తున్నారు. కెజిఎఫ్ ఫేమ్ రవి బస్రూర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్ గా స్వామి జె గౌడ పనిచేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదల చేసిన టైటిల్, ఫస్ట్ లుక్ కు మంచి స్పందన వచ్చింది. దీనితో ఈ సినిమాను మహాశివరాత్రి కానుకగా మార్చి 8న విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించి ‘గల్లీ సౌండుల్లో… నువ్వు బ్యాండు కొట్టూ మామా. బాసూ… బిందాసూ వచ్చాడు చూడూ భీమా’ అంటూ సాగే పాటను విడుదల చేసింది చిత్ర యూనిట్. ప్రస్తుతం ఈ పాట యూట్యూబ్ లో గోపీచంద్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

Gopichand Bhima Song Update

‘టెక్కు… టెంపరు ఒక్కటైతేనే ఈ భీమా… నువ్వు సైడ్‌ అయిపోరా మామా’… ‘గల్లీ సౌండుల్లో… నువ్వు బ్యాండు కొట్టూ మామా. బాసూ… బిందాసూ వచ్చాడు చూడూ భీమా’ అంటూ సాగే పాటని చిత్ర యూనిట్ బుధవారం విడుదల చేశారు. రవి బస్రూర్‌ సంగీతం అందించిన ఈ పాటను సంతోష్‌ వెంకీ ఆలపించారు. ఆ ఇద్దరూ కలిసి ఈ పాటకి సాహిత్యం సమకూర్చారు. శక్తిమంతమైన పోలీసు అధికారి పాత్రలో గోపీచంద్ నటించిన ఈ సినిమా యాక్షన్‌ ప్రధానంగా సాగుతుంది. నేరస్థుల్ని భయపెట్టే పోలీసుగా ఆయన పాత్ర, నటన అలరిస్తుందని చిత్ర యూనిట్ తెలిపింది.

Also Read : Geethanjali Malli Vachindhi: స్మశానంలో టీజర్ లాంచ్ చేయబోతున్న‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ టీం !

BhimaaGopichand
Comments (0)
Add Comment