Leo: ఓటీటీలోకి ‘లియో’… డేట్ ఫిక్స్ చేసిన నెట్ ఫ్లిక్స్…

ఓటీటీలోకి 'లియో'... డేట్ ఫిక్స్ చేసిన నెట్ ఫ్లిక్స్...

Leo : కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన తాజా చిత్రం ‘లియో’. కోలీవుడ్ స్టైలిష్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా పాజిటివ్ టాక్ సంపాదించడంతో పాటు వసూళ్ల పరంగా సత్తా చాటింది. విజయ్ కెరీర్‌ లో మాత్రమే కాదు కోలీవుడ్ హిస్టరీ లోనే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా లియో చరిత్ర సృష్టించింది. దీనితో థియేటర్లలో సూపర్ హిట్టయిన లియో సినిమా ఓటీటీ రిలీజ్ కోసం కూడా చాలామంది ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. దీనికి తోడు థియేట్రికల్ వెర్షన్ కు కాస్త భిన్నంగా… 18 నిమిషాల అదనపు సన్నివేశాలు ఉండబోతున్నాయని దర్శకుడు లోకేష్ కనగరాజ్ ప్రకటించడంతో ఓటీటీ వెర్షన్ పై ఆశక్తి నెలకొంది.

Leo – ఎట్టకేలకు ఓటీటీలో ‘లియో’

లియో నిర్మాణ సంస్థతో నెట్ ఫ్లిక్స్ ఒప్పందం ప్రకారం ఈ సినిమాను నవంబరు 21న స్ట్రీమింగ్ చేస్తున్నట్లు గతంలో నెట్ ఫ్లిక్స్ యాజమాన్యం ప్రకటించింది. ఆ వెంటనే ఐదు రోజుల ముందు అంటే నవంబరు 16న స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు నెట్ ఫ్లిక్స్ యాజమాన్యం లీక్ లు ఇచ్చింది. ప్రపంచ కప్ క్రికెట్ ప్రభావమో ఏంటో తెలియదు కాని నవంబరు 16న స్ట్రీమింగ్ అవుతుందని ఎదురుచూసిన విజయ్ అభిమానులకు నెట్ ఫ్లిక్స్ యాజమాన్యం నిరాశ మిగిల్చింది. అయితే నెట్ ఫ్లిక్స్ యాజమాన్యం ‘లియో(Leo)’ రిలీజ్ డేట్ ను ఎట్టకేలకు కన్ఫర్మ్ చేసింది. విజయ్ సరసన త్రిష నటించిన ఈ సినిమాను నవంబర్ 24 నుండి ఇండియాలో… 28 నుండి ప్రపంచ వ్యాప్తంగా స్ట్రీమింగ్ కానున్నట్లు ఎట్టకేలకు నెట్ ఫ్లిక్స్ యాజమాన్యం ప్రకటించింది. ఈ సందర్భంగా నెట్ ఫ్లిక్స్ యాజమాన్యం విడుదల చేసిన టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

Also Read : Sreeleela : వామ్మో శ్రీలీల అలా కూడా డబ్బు సంపాదిస్తోందా?

LEOlokesh kanakrajVijay
Comments (0)
Add Comment