Nelson Dilipkumar : త‌లైవా వ్య‌క్తిత్వం అద్భుత పాఠం

ర‌జ‌నీకాంత్ కు కృత‌జ్ఞ‌త‌తో డైరెక్ట‌ర్ లేఖ

Nelson Dilipkumar : సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ తో జైల‌ర్ తీసిన నెల్స‌న్ దిలీప్ కుమార్ సుదీర్ఘ లేఖ రాశారు. త‌లైవాతో సినిమా చేయ‌డం తాను అదృష్టంగా భావిస్తున్నాన‌ని పేర్కొన్నాడు. ర‌జ‌నీ స‌ర్ సినీ అనుభ‌వం జీవితంలో ఎంత‌గానో ప‌నికి వ‌స్తుంద‌న్నారు.

Nelson Dilipkumar

వృత్తి ప‌ట్ల అంకిత భావం త‌న‌ను ఎంత‌గానో ప్ర‌భావితం చేసింద‌ని స్ప‌ష్టం చేశారు ద‌ర్శ‌కుడు. ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండే వ్య‌క్తిత్వం త‌న‌ను ఆక‌ట్టుకుంద‌ని పేర్కొన్నారు నెల్స‌న్ దిలీప్ కుమార్(Nelson Dilipkumar). ర‌జ‌నీ సినీ కెరీర్ లో తాను తీసిన జైల‌ర్ బిగ్ స‌క్సెస్ ఇచ్చాడు.

ఆగ‌స్టు 10న విడుద‌లైన జైల‌ర్ వ‌ర‌ల్డ్ వైడ్ గా నేటి దాకా రూ. 650 కోట్లు వ‌సూలు చేసింది. రికార్డు సృష్టించింది. ర‌జ‌నీకాంత్ నుంచి ప్ర‌తిరోజూ నేర్చుకునే సౌల‌భ్యం ఉంద‌ని తెలిపారు డైరెక్ట‌ర్. రెండేళ్ల గ్యాప్ త‌ర్వాత ఊహించ‌ని రీతిలో సూప‌ర్ స్టార్ కు ఈ మూవీ స‌క్సెస్ ఇచ్చింది.

త‌న సంతోషాన్ని పంచుకున్నారు. ఇదిలా ఉండ‌గా జైల‌ర్ సినిమాను నిర్మించిన స‌న్ పిక్చ‌ర్స్ కు, ప‌ని చేసిన మూవీ సిబ్బందికి , న‌టీ న‌టులంద‌రికీ ధ‌న్య‌వాదాలు తెలిపారు నెల్స‌న్ దిలీప్ కుమార్. ప్ర‌త్యేకించి అవ‌కాశం ఇచ్చినందుకు ర‌జ‌నీకాంత్ కు రుణ‌ప‌డి ఉన్నాన‌ని పేర్కొన్నారు.

ఇది నా జీవితంలో అత్యంత ఐశ్వర్యవంతమైన అనుభవాలలో ఒకటిగా నిలిచిపోతుందని దర్శకుడు తెలిపారు. త‌మ‌న్నా భాటియా, శివ రాజ్ కుమార్ , మోహ‌న్ లాల్ , ర‌మ్య కృష్ణ‌, యోగి బాబు తో పాటు మ్యూజిక్ డైరెక్ట‌ర్ అనిరుధ్ ర‌విచంద‌ర్ ను గుర్తు చేసుకున్నారు.

Also Read : Disha Parmar Rahul Vaidya Viral : దిశా ప‌ర్మార్..వైద్య వైర‌ల్

Comments (0)
Add Comment