Nelson Dilipkumar : ఎక్కడ చూసినా ఇప్పుడు ఒకటే మేనియా నడుస్తోంది. యంగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన జైలర్ దుమ్ము రేపుతోంది. కోట్లు కొల్లగొట్టేలా చేస్తోంది. తమిళనాడుతో పాటు ఇండియా వ్యాప్తంగా కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది.
Nelson Dilipkumar Comments Viral
అంతే కాదు ఓవర్సీస్ లో కూడా ఏ సినిమాకు దక్కని రీతిలో కలెక్షన్లు కొల్లగొట్టింది జైలర్ . సూపర్ స్టార్ రజనీకాంత్ , ముద్దుగుమ్మ తమన్నా భాటియా తో పాటు యోగి బాబు, శివ రాజ్ కుమార్ , మోహన్ లాల్ , రమ్య కృష్ణన్ కీలక పాత్రలలో నటించారు.
ఒక్క తమిళనాడులోనే జైలర్ ఏకంగా రూ. 225 కోట్లు సాధించింది. ఇక వరల్డ్ వైడ్ గా రజనీకాంత్ దెబ్బకు ఏకంగా రూ. 650 కోట్లు దాటేసింది. అనిరుధ్ రవిచందర్ ఇచ్చిన మ్యూజిక్ దుమ్ము రేపింది. ప్రత్యేకించి రజనీకాంత్ మేనరిజం జైలర్ చిత్రానికి అదనపు బలాన్ని చేకూర్చింది.
ఇదిలా ఉండగా జైలర్ చిత్రం ఊహించని సక్సెస్ అందుకోవడంతో దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్(Nelson Dilipkumar) స్పందించాడు. రజనీకాంత్ ను తాను మరిచి పోలేనని పేర్కొన్నారు. ఇంత అద్భుతంగా చిత్రం వచ్చేలా చేసినందుకు, సహకరించినందుకు, భారీ సక్సెస్ అయ్యినందుకు సంతోషంగా ఉందన్నారు.
Also Read : Khushi Movie : ఫీల్ గుడ్ సినిమా ఖుషీ