Neha Shetty: క్వాలిటీ ముఖ్యం అంటున్న డిజే టిల్లూ బ్యూటీ

క్వాలిటీ ముఖ్యం అంటున్న డిజే టిల్లూ బ్యూటీ

Neha Shetty: ‘డీజే టిల్లు’ సినిమాతో రాధికగా ప్రేక్షకుల్లో తిరుగులేని గుర్తింపు పొందిన కన్నడ బ్యూటీ నేహా శెట్టి. తెలుగులో మెహబూబా, మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్, గల్లి రౌడీ, బెదురులంక 2012, రూల్స్ రంజన్ వంటి సినిమాల్లో ఆమె నటించినప్పటికీ… యూత్ ఆడియెన్స్‌లో మాత్రం రాధికగా మంచి ఫేమ్ సంపాదించింది. యువతలో కావాల్సినంత క్రేజ్ సంపాదించినప్పటికీ… ఈ కన్నడ బ్యూటీ మాత్రం వరుసగా సినిమాలు చేయడం లేదు. దీనికి ఆమె చెప్పిన కారణం ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారుతోంది.

Neha Shetty – క్వాంటిటీ కంటే క్వాలిటీ ముఖ్యమంటున్న రాధిక

ఇటీవల న్యూయార్క్ ఫిలిం అకాడెమీలో నాలుగు నెలల స్పెషల్ కోర్స్ చేసిన నేహా శెట్టి… తన నటనను మెరుగు పరచుకోవడానికి ఈ కోర్స్ ఎంతో ఉపయోగపడిందని చెప్పుకొచ్చింది. ఈ నేపథ్యంలోనే నటిగా వైవిధ్యమైన, భిన్నమైన క్యారెక్టర్స్‌లో నటించడానికి ప్రయత్నిస్తున్నాని… అందుకే తనకు క్వాంటిటీ కంటే క్వాలిటీ ముఖ్యమని చెబుతుందీ యంగ్ బ్యూటీ. మంచి సినిమాలు చేసి మరింతగా ప్రేక్షకుల ఆదరణ పొందాలనే ఉద్దేశ్యంతోనే వచ్చిన ప్రతీ ఆఫర్ కు ఓకే చెప్పడం లేదని నేహా శెట్టి(Neha Shetty) స్పష్టం చేస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆమె నటించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలో బుజ్జి పాత్రలో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటానని చెప్పింది.

గ్యాంగ్స్ ఆఫ్ గోదావరితో బుజ్జిగా వస్తున్న నేహా శెట్టి

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తం నిర్మాణంలో కృష్ణ చైతన్య దర్శకత్వంలో విశ్వక్ సేన్, నేహా శెట్టి హీరోహీరోయిన్లుగా తెరకెక్కిస్తున్న సినిమా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా… డిసెంబరు 8న విడుదల కావాల్సి ఉన్నప్పటికీ అనివార్య కారణాల వలన చిత్ర యూనిట్ ఈ సినిమాను వచ్చే ఏడాది మార్చి 8కు వాయిదా వేసారు. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే విడుదలైన ‘సుట్టంలా సూసి’ పాట చార్ట్ బస్టర్‌గా నిలిచింది. ఈ పాటలో నేహా శెట్టి గ్లామర్ యూత్ ఆడియెన్స్‌ను కట్టిపడేస్తుంది.

Also Read : Hero Naga Chaitanya: ‘తండేల్‌’ కు శ్రీకారం చుట్టిన నాగచైతన్య

dj tilluNeha Shetty
Comments (0)
Add Comment