Neha Dhupia: గ్లోబల్‌ స్టార్‌ గా మరో బాలీవుడ్ బ్యూటీ

గ్లోబల్‌ స్టార్‌ గా మరో బాలీవుడ్ బ్యూటీ
Neha Dhupia: గ్లోబల్‌ స్టార్‌ గా మరో బాలీవుడ్ బ్యూటీ

Neha Dhupia: హాలీవుడ్ సినిమాల్లో నటించే భారతీయ నటీనటులు సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. అమితాబచ్చన్, ఐశ్వర్య రాయ్, దీపికాపదుకునే, ప్రియాంక చోప్రా, అనుపమ్ ఖేర్, ఇర్ఫాన్ ఖాన్, అమ్రిష్ పురి, టబు, ధనుష్, రజనీకాంత్ తరువాత ఆ జాబితాలో సీనియర్‌ నటి నేహా ధూపియా(Neha Dhupia) స్థానం సంపాదించింది. నేహా ధూపియా ప్రధాన పాత్రధారిగా ‘బ్లూ 52’ అనే అంతర్జాతీయ చిత్రం తెరకెక్కనుంది. ఈ ఎమోషన్‌ డ్రామాకి ప్రముఖ ఈజిప్షియన్‌ దర్శకుడు అలీ ఎల్‌ అరబీ దర్శకత్వం వహిస్తున్నారు.

Neha Dhupia Viral as a Global Star

ఎన్నో ఫిక్షన్‌ హిట్‌ చిత్రాలకు దర్శకత్వం వహించిన అలీ ఎల్‌ అరబీ… ఈ సినిమాను కేరళలోని కొచ్చి, ఖతార్‌ దేశాల నేపథ్యంతో తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ‘‘బ్లూ 52’కి ఎంపికవడం నా కెరీర్‌లోనే ఓ అద్భుతం. తొలిసారే భిన్న సంస్కృతుల కథ.. భావోద్వేగాలు పండించే ఆస్కారమున్న పాత్ర దొరకడం నిజంగా నా అదృష్టం. ప్రపంచవ్యాప్తంగా పేరున్న అలీ దర్శకత్వంలో నా తొలి అంతర్జాతీయ చిత్రంలో నటించడం మర్చిపోలేను’ అంటూ తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా నేహా ధూపియా సంతోషం వ్యక్తం చేసింది. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత తారిఖ్‌ అల్‌ నామా నిర్మిస్తున్నారు.

1980లో కేరళలోని కొచ్చిలో సిక్కుల కుటుంబంలో జన్మించిన ఈ బ్యూటీ మిన్నారం సినిమాతో మలయాళంలో 1994లో సినీ రంగ ప్రవేశం చేసింది. 2002లో ఫెమినా మిస్ ఇండియాగా ఎంపికైన ఈ మలయాళ బ్యూటీ ఆ తరువాత… “ఖయామత్: సిటీ అండర్ థ్రెట్” అనే సినిమాతో బాలీవుడ్ రంగప్రవేశం చేసింది. నిన్నే ఇష్టపడ్డాను, విలన్, పరమమీర చక్ర వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నేహా… ఎన్నో అవార్డులను సొంతం చేసుకుంది.

Also Read : Ayesha Omar: మహిళా భద్రతపై నటి ఆయేషా ఒమర్‌ సంచలన వ్యాఖ్యలు

Neha Dhupia
Comments (0)
Add Comment