Neena Gupta: తప్పుడు మనుషులతో డేటింగ్ చేసానంటూ బాలీవుడ్ బ్యూటీ పశ్చాతాపం

తప్పుడు మనుషులతో డేటింగ్ చేసానంటూ బాలీవుడ్ బ్యూటీ పశ్చాతాపం

Neena Gupta : మాధురీ దీక్షిత్ తో కలిసి ‘ఖల్ నాయక్’ చిత్రంలోని ఛోళీకీ పీఛే క్యాహై అనే సూపర్ హిట్ పాటలో నర్తించిన నీనా గుప్తా… అప్పట్లో ఓ సంచలనం. బాలీవుడ్ తో పాటు టీవి రంగంలో కూడా తనదైన ముద్ర వేసుకుంది నీనా గుప్తా(Neena Gupta). అదే సమయంలో వెస్టిండీస్ క్రికెటర్ తో ప్రేమలో పడి… వీరి ప్రేమకు గుర్తుగా మసాబాకు జన్మనిచ్చింది. అయితే వీరి ప్రేమ పెళ్ళి వరకు వెళ్ళకపోవడంతో…. మసాబా గుప్తాను సింగిల్ పేరెంట్ గానే పెంచింది.

ఆ తరువాత అలోక్ నాథ్, సారంగ దేవ్‌లతో కొంతకాలం పాటు సహాజీవనం చేసిన నీనా…. 2008లో వివేక్ మెహ్రా అనే ఛార్టెడ్ అకౌంటెంట్‌ను రహస్యంగా వివాహం చేసుకుని ఢిల్లీలో స్థిరపడింది. అయితే తనతో పాటు తన కుమార్తె మసాబా జీవితం విషయంలో కూడా తాను సరైన నిర్ణయం తీసుకోకపోయానంటూ ఇటీవల ఆమె రచించిన ఆత్మకథ ‘సచ్ కహున్ తోహ్’లో వెల్లడించింది.

Neena Gupta – తల్లి నీనా బాటలో…. కుమార్తె మసాబా జీవితం ?

ఇక మసాబా జీవితం విషయానికి వస్తే… ఫ్యాషన్ డిజైనర్ గా కెరియర్ ను ప్రారంభించిన మసాబా… 2015లో నిర్మాత మధు మంతెనను పెళ్లాడి… మనస్పర్ధలతో 2019లో విడాకులు ఇచ్చేసింది. నటుడు సత్యదీప్‌ మిశ్రాతో ప్రేమలో పడిన మసాబా… ఈ ఏడాది జనవరి 27న రెండో పెళ్లి చేసుకుంది. అయితే సత్యదీప్‌ కు కూడా ఇది రెండో పెళ్లే. సత్యదీప్‌ గతంలో హీరోయిన్‌ అదితి రావును పెళ్లాడి, తర్వాత విడాకులిచ్చేశాడు.

సలహాలు ఇవ్వడానికి నేను కరెక్టు కాదంటున్న నీనా

అయితే మసాబా మొదటి పెళ్లి పెటాకులవడానికి కారణం తానే అంటూ నీనా తన ఆత్మకథలో పశ్చాతాపం చెందింది. మసాబా మొదట పెళ్లి చేసుకోవాలని అనుకోలేదు. కాబోయే భర్తతో సహజీవనం చేయాలనుకుంది. అందుకు నేను ఒప్పుకోలేదు. పెళ్లి చేసుకున్నాకే తనతో కలిసి ఉండాలని చెప్పాను. అదే నేను చేసిన తప్పు. పెళ్లయిన కొంతకాలానికి వారు విడాకులు తీసుకున్నారు. అప్పుడు నేను కుంగిపోయాను, జీర్ణించుకోలేకపోయాను. వాళ్ల జంటను చూసి మేము ముచ్చటపడేవాళ్లం. ఇప్పటికీ నా మాజీ అల్లుడి మీద నాకు అభిమానం ఉంది. విడాకుల వార్త చెప్పగానే నోట మాట రాలేదు. కానీ అది వారి జీవితం.. కాబట్టి నేను ఏమీ చేయలేకపోయాను’ అని చెప్పుకొచ్చింది నీనా గుప్తా. దీనితో ‘రిలేషన్‌షిప్‌ గురించి సలహాలివ్వడానికి నేను సరైన వ్యక్తిని కాదు. ఎందుకంటే నేను ఎప్పుడూ తప్పుడు మనుషులతోనే డేటింగ్‌ చేశాను. కాబట్టి నేను మంచి సలహాలివ్వలేను. అదే తప్పు మసాబా విషయంలో కూడా చేశాను అంటోంది.

సహాజీవనం, పెళ్లి రెండు బంధాల్లోనూ దెబ్బలు తిన్న నీనా

సహాజీవనం వలన తాను కోల్పోయిన వివాహ బంధం… తన కుమార్తె కోల్పోకూడదు అనే ఉద్యేశ్యంతో బలవంతంగా మసాబాకు పెళ్ళి చేసింది నీనా గుప్తా(Neena Gupta). అయితే మసాబా పెళ్ళి మూడునాళ్ళ ముచ్చటగానే మిగిలిపోవడంతో…. సహాజీవనంతో తల్లి… పెళ్ళితో కుమార్తె జీవితాలు చిన్నాభిన్నమైనట్లు బాలీవుడ్ లో చర్చించుకుంటున్నారు.

Also Read : Siddu Jonnalagadda: రాధిక అంటూ అనుపమ వెంట పడుతున్న డిజే టిల్లు

masaba gupthaneena guptha
Comments (0)
Add Comment