Popular Actress-Neena Gupta : 99 శాతం మ‌హిళ‌ల‌కు సెక్స్ గురించి తెలియ‌దు

సెక్స్ గురించి నీనా గుప్తా షాకింగ్ కామెంట్స్ 

Niva Gupta : ప్ర‌ముఖ బాలీవుడ్ న‌టి నీనా గుప్తా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. ఆమె సెక్స్ గురించి తాజాగా స్పందించింది. చిట్ చాట్ సంద‌ర్భంగా త‌న అభిప్రాయాల‌ను నిర్మోహ మాటంగా వెల్ల‌డించింది. ఇప్ప‌టికీ భార‌త దేశంలో మ‌హిళ‌లకు శృంగారంలో ఉన్న మ‌జా ఏమిటో తెలియ‌ద‌న్నారు. ముద్దు పెట్టుకోవ‌డం వ‌ల్ల గ‌ర్భాలు వ‌స్తాయ‌ని ఇంకా భ్ర‌మ‌ల్లో బ‌తుకుతున్నారంటూ పేర్కొన్నారు. 99 శాతం మ‌హిళ‌ల‌కు సెక్స్ ఆనందం కోస‌మేన‌ని తెలియ‌ద‌న్నారు నీనా గుప్తా.

Neena Gupta Shocking Comments

వ‌య‌సు పెరిగినా ఇంకా య‌వ్వ‌నంగా ఉండేందుకు ఏం వ‌స్తువులు వాడ‌తారంటూ వేసిన ప్ర‌శ్న‌కు ఆస‌క్తిక‌ర‌మైన స‌మాధానం ఇచ్చింది. నిరంత‌రం సెక్స్ లో పాల్గొన‌డం, ఆ అనుభూతి చెంద‌డం వ‌ల్ల‌నే తాను ఇలా ఉన్నానంటూ చెప్పింది. డ‌బ్బును పోతే తెచ్చుకోగ‌లం, కానీ ఆనందం ఎక్క‌డా దొర‌క‌ద‌ని పేర్కొంది. అది మ‌న‌సుకు సంబంధించిన అంశ‌మ‌ని స్ప‌ష్టం చేసింది నీనా గుప్తా(Neena Gupta). ఇటీవల, భారతదేశంలో సెక్స్ , లైంగిక కోరికల ఆలోచనను సినిమాలు ఎలా రూపొందించాయో కూడా తెలిపింది.

ప్ర‌స్తుతం ఉన్న మ‌హిళ‌ల‌ను చూస్తే త‌న‌కు జాలి వేస్తోంద‌న్నారు . వీరికి పురుషుల‌ను సంతోష పెట్ట‌డం, పిల్ల‌ల‌ను క‌న‌డ‌మే త‌ప్పా ఇంకేమీ తెలియ‌దంటూ వాపోయింది  నీనా గుప్తా(Neena Gupta). ఈ దేశంలో స్వేచ్ఛ ల‌భించినా మ‌హిళ‌లు రెండో త‌ర‌గ‌తి శ్రేణి పౌరులుగానే బ‌తుకుతున్నారని ఆవేద‌న చెందారు సీనియ‌ర్ న‌టి. గ‌తంలో సినిమాల్లో కూడా ముద్దులు పెట్టుకుంటే చాలు గ‌ర్భ‌వతులు అవుతార‌ని భ్ర‌మ‌లో ఉండేవార‌న్నారు. తాజాగా నీనా గుప్తా చేసిన కామెంట్స్ క‌ల‌క‌లం రేపుతున్నాయి.

Also Read : Posani Krishna Murali- Big Shock :పోసాని కృష్ణ ముర‌ళికి బిగ్ షాక్

CommentsNiva GuptaViral
Comments (0)
Add Comment