NBK50 : అమెరికాలో బాలయ్య గోల్డెన్ జూబ్లీ వేడుకలు

అమెరికాలో బాలయ్య గోల్డెన్ జూబ్లీ వేడుకలు..

NBK50 : నందమూరి నటసింహం బాలకృష్ణ తెలుగు చలన చిత్ర రంగంలో 50 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్బంగా ఈ సెప్టెంబర్ 1న హైదరాబాద్‌లో బాలయ్య అభిమానులు, సినీ ప్రముఖులు హైదరాబాద్ లో గోల్డెన్ జూబ్లీ వేడుకలను ఘనంగా నిర్వహించిన సంగ‌తి తెలిసిందే. అయితే తాజాగా సెప్టెంబర్ 14న అమెరికాలోని న్యూ ఇంగ్లాండ్‌లో బోళ్ల అండ్‌ తరణి పరుచూరి అధ్వర్యంలో బాల‌య్య‌ గోల్డెన్ జూబ్లీ సెలెబ్రేషన్స్ ను అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా జై బాలయ్య అంటూ నినాదాలు చేస్తూ కేక్ కటింగ్ చేశారు. ఈ కార్యక్రమానికి సుప్రీత, శశాంక్ వ్యాఖ్యతలుగా వ్యవహరించగా, సింగర్స్ హర్షిత యార్లగడ్డ, రాజీవ్‌లు బాలయ్య పాటలను పాడి నందమూరి అభిమానులను అలరించారు.. అనంతరం ప్రముఖ క్లాసికల్ డ్యాన్సర్ శైలజ చౌదరి అండ్ గ్రూప్ నృత్య ప్రదర్శన నిర్వ‌హించారు.

NBK50 Celebrations..

రావి అంకినీడు ప్రసాద్, అశ్విన్ అట్లూరి, శ్రీనివాస్ గొంది, అనిల్ పొట్లూరి , శ్రీకాంత్ జాస్తి ,సురేష్ దగ్గుపాటీ, సూర్య తెలప్రోలు, చంద్ర వల్లూరుపల్లి ,రావ్ కందుకూరి,శశాంక్ , దీప్తి కొర్రపల్లి, కాళిదాస్ సూరపనేని వంటి వారు ఇక ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి స‌హాకారం అందించారు. ప్రస్తుతం ఈ ఈవెంట్ కు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Also Read : Ammoru Thalli: నయనతార హిట్‌ సినిమాకు సీక్వెల్‌ ! దర్శకుడిని మార్చేసిన మేకర్స్‌ !

BalakrishnaTrendingUpdatesViral
Comments (0)
Add Comment