Nayanthara: మోడల్ గా గ్లామర్ ఫీల్డ్ లో అడుగుపెట్టి… ‘మనస్సినక్కరే’ అనే మలయాళ సినిమాతో 2004లో సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టి… దక్షిణాది అగ్రతారగా నిలిచిన నటి నయనతార. తన అందం, అభినయంతో నాలుగు పదుల వయసులో కూడా ప్రేక్షకులను అలరిస్తూ లేడీ సూపర్ స్టార్ గా గుర్తింపుపొందిన నయన్(Nayanthara)… తాజాగా అట్లీ దర్శకత్వంలో షారూక్ ఖాన్ హీరోగా తెరకెక్కించిన జవాన్ సినిమాతో బాలీవుడ్ లో కూడా తన సత్తాను చూపించింది. నటిగా రెండు దశాబ్దాలు పూర్తి చేసుకుని లేడీ సూపర్ స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకున్న నయనతార… ఇటీవల దర్శకుడు విఘ్నేష్ శివన్ ను పెళ్లి చేసుకుని అటు సినిమా, ఇటు ఫ్యామిలీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తుంది. జవాన్ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకున్న నయనతార… తాజాగా తన ఫ్రెండ్స్ తో కలిసి రోడ్లపై ఐస్ క్రీం తింటూ ఎంజాయ్ చేసిన ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.
Nayanthara on Roads
భారతదేశంలోనే గొప్ప స్టార్ గా వెలుగుతున్న `తలైవి` నయనతార తన స్నేహితులతో కలిసి మిడ్ నైట్‌లో ఒక ఫుట్ పాత్ పై ఐస్ క్రీమ్ తింటూ ఎంజాయ్ చేయడం ఆశ్చర్యపరిచింది. చుట్టూ ఆ పరిసరాలు ఎంతో నిశ్శబ్ధంగా జనసంచారం లేకుండా కనిపిస్తోంది. ఆ సమయంలో తన స్నేహితులతో కలిసి నయన్ ఐస్ క్రీమ్ ని ఎంజాయ్ చేస్తూ ఎంతో జోవియల్ గా ఆనందంగా కనిపించారు. ప్రస్తుతం ఆన్ లైన్ లో చక్కర్లు కొడుతున్న వైరల్ వీడియో అభిమానులకు స్పెషల్ ట్రీట్ గా మారింది. నయనతార స్వయంగా సోషల్ మీడియాలో షేర్ చేసిన ఈ వీడియోని అభిమానులు పదే పదే తరచి చూస్తున్నారు.
నయనతార తన ఇద్దరు స్నేహితులు అర్థరాత్రి నిశీధిలో ఒక వీధిలో ఐస్ క్రీం తినడం విచిత్రమైన సంఘటన. నయనతార(Nayanthara) ఒదిగి ఉండే స్వభావాన్ని ఈ ఘటన రివీల్ చేసింది. వారంతా ఐస్ క్రీమ్ తింటుండగా, రోడ్ కి ఆపోజిట్ వీధిలో తనిష్క్ జ్యువెలర్స్ ప్రకటనలో నయనతార బ్యానర్ గ్లింప్స్ ని స్నేహితులు గుర్తించడంతో ఐస్ క్రీం సాహసం మరింత ఆసక్తికర మలుపు తిరిగింది. బిల్ బోర్డ్ లో నయనతార ఐదున్నర అడుగుల విగ్రహం ఎంతో శోభాయమానంగా కనిపిస్తోంది. దాని గురించి నయనతార తన స్నేహితుల మధ్య సరదా ఆట వీడియో ఎంతో ఫన్నీగా కనిపిస్తోంది. నయనతార వ్యక్తిగత జీవితంలో ఎంత సింపుల్ గా ఉంటారో ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది. పెద్ద స్టార్‌లు కూడా సాధారణ ఆనందాలను ఆస్వాధించేందుకు వెనకాడరనేందుకు ఇది ఉదాహరణ.
ఇక నయనతార సినిమాల విషయానికి వస్తే… నయనతార తాజాగా నటించిన `జవాన్` బాక్సాఫీస్ వద్ద 1000 కోట్ల వసూళ్లతో సంచలనం సృష్టించింది. ఆ తరువాత ‘అన్నపూరణి’… ది గాడెస్ ఆఫ్ ఫుడ్ అనే ట్యాగ్ లైన్ తో వచ్చిన ఈ సినిమాకు యువ దర్శకుడు నీలేశ్ కృష్ణ దర్శకత్వం వహించగా నయనతార, జై ప్రధాన పాత్రల్లో నటించారు. ప్రస్తుతం నయనతార ఎస్ శశికాంత్ దర్వకత్వంలో తెరకెక్కిస్తున్న ‘టెస్ట్’ అనే సినిమాలోనూ నటిస్తున్నారు. ఆర్.మాధవన్, సిద్ధార్థ్ లు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.కుముద చిత్రీకరణ పూర్తయింది. మన్ననగట్టి సిన్స్ 1960 అనే చిత్రంలో కూడా నయన్ నటిస్తోంది.
Also Read : Ramayan: ‘రామాయణ’ సినిమా సెట్ ఫోటోలు లీక్ ! దర్శకుడు నితీశ్ కఠిన నిర్ణయం !