Nayanthara: మాంసం తినడం పాపం కాదు అంటున్న నయనతార

మాంసం తినడం పాపం కాదు అంటున్న నయనతార

Nayanthara : బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్ అని తేడా లేకుండా వరుస సినిమాలతో జోరుమీద ఉంది లేడీ సూపర్ స్టార్ నయనతార. జవాన్ తో పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ ను అందుకున్న నయనతార… త్వరలో కమల్-మణిరత్నం కాంబోలో తెరకెక్కబోయే థగ్స్ ఆఫ్ లైఫ్ లో అవకాశం దక్కించుకుంది. ప్రస్తుతం ఎస్. ఆర్.రవీంద్రన్ సమర్పణలో, నాస్ స్టూడియోస్ -ట్రైడెంట్ ఆర్ట్స్, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న‘అన్నపూరణి’ సినిమాలో నటిస్తోంది. నీలేష్ కృష్ణ అనే కొత్త దర్శకుడితో న‌య‌న‌తార చేస్తున్న ఈ చిత్రం డిసెంబరు 1న విడుదల కాబోతుంది. ఈ సినిమాకు సంబందించి విడుదల చేసిన టీజర్… లేడీ సూపర్ స్టార్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

Nayanthara – ఆకట్టుకుంటున్న ‘అన్నపూరణి’ ట్రైలర్

‘అన్నపూరణి’ సినిమా విషయానికి వస్తే… సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన నయనతార(Nayanthara) ఒక ప్రొఫెషనల్ చెఫ్‌గా మారాలనుకుంటుంది. ఈ క్ర‌మంలో త‌న‌కు ఎదురైనా స‌వాళ్లు ఎంటి.. కుటుంబం నుంచి వ‌చ్చిన ఒత్తిడిని త‌ట్టుకుని దేశంలో బెస్ట్ చెఫ్ గా ఎలా ఎదిగింది అనేది ఈ సినిమా స్టోరీ అని అర్థ‌మ‌వుతుంది. ఇక ఏ దేవుడు కూడా మాంసం తినడం పాపం అని చెప్పలేదు అంటూ వ‌చ్చే డైలాగ్ ట్రైల‌ర్‌కే హైలెట్‌గా నిలిచింది. నయనతార తన కుటుంబం, తన సామాజికవర్గం, పురుషాధిక్యతను ఎదుర్కొని ఎలా తన లక్ష్యాన్ని చేరుకుందన్నదే కథగా తెరకెక్కించినట్లు దర్శకుడు నీలేష్ కృష్ణ పేర్కొన్నారు.

లేడీ సూపర్ స్టార్ కోసం ఏళ్ళ పాటు నిరీక్షించిన దర్శకుడు నీలేష్ కృష్ణ

‘అన్నపూరణి’ కథను కొన్నేళ్ల కిత్రమే నయనతారకు వినిపించారన్నారు దర్శకుడు నీలేష్ కృష్ణ. అయితే ఆమె ఆ సమయంలో యాక్షన్‌, థ్రిల్లర్‌, కమర్షియల్‌ కథా చిత్రాలు అధికంగా చేస్తున్నారని.. ఈ కథ వాటికి భిన్నంగా ఉందని చెప్పి నటించడానికి సంసిద్ధతను వ్యక్తం చేశారన్నారు. అయితే ప్రస్తుతం తాను అంగీకరించిన చిత్రాలను పూర్తి చేసిన తర్వాతే చిత్రంలో నటించగలనని, అంతవరకు వేచి చూడగలరా అని అడిగారన్నారు. అలా నయనతార కోసం ఎదురుచూసి ఈ చిత్రాన్ని పూర్తి చేశామని చెప్పారు. ఈ సినిమాలో సత్యరాజ్‌, జయ్‌, కేఎస్‌ రవికుమార్‌, కుమారి సచ్చు, తదితరులు ముఖ్యపాత్రలు పోషించగా… తమన్‌ సంగీతాన్ని అందిస్తున్నారు.

Also Read : Kalyan Ram: కల్యాణ్‌ రామ్‌ ‘డెవిల్‌’ నుండి సెకండ్ సింగిల్ రిలీజ్

Nayanthara
Comments (0)
Add Comment