Yash : తమిళ సినీ సూపర్ స్టార్ నయనతార వైరల్ గా మారారు. తను ఇప్పుడు కన్నడ సూపర్ స్టార్ యశ్(Yash) తో కలిసి కీ రోల్ పోషిస్తోంది తను. టాక్సిక్ మూవీ శరవేగంగా కొనసాగుతోంది. గీతూ మోహన్ దాస్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. భారీ బడ్జెట్ తో దీనిని నిర్మిస్తున్నారు. ఇప్పటికే కేజీఎఫ్ , సిక్వెల్ మూవీతో దుమ్ము రేపాడు. ఈ చిత్రంలో నయనతారతో పాటు మరో హీరోయిన్ కియారా అద్వానీ కూడా నటిస్తుండడంతో అంచనాలు మరింత పెరిగేలా చేస్తోంది.
Yash – Nayanthara New Movie
భారతీయ సినీ ఇండస్ట్రీలో పాన్ ఇండియా లెవల్లో చిత్రీకరణ జరుగుతోంది టాక్సిక్. ఇక నయనతారతో(Nayanthara) కొన్ని సన్నివేశాలను ఇప్పటికే పూర్తి చేసినట్టు సమాచారం. ఇక నయన్ గత ఏడాది లో షారుక్ ఖాన్ తో కలిసి జవాన్ లో నటించింది. ఇది బ్లాక్ బస్టర్ గా నిలిచింది. దీనిని తమిళ సూపర్ డైరెక్టర్ అట్లీ కుమార్ తీశాడు. తను మరో మూవీకి సంతకం చేశాడు. భారీ రెమ్యూనరేషన్ ఇచ్చి బన్నీతో చేయనున్నాడు. ఇది ఇంటర్నేషనల్ లెవల్లో ఉంటుందని టాక్.
కవల పిల్లలకు జన్మనిచ్చిన నయనతార ఇప్పుడు హాట్ టాపిక్ గా మారడం విశేషం. ప్రస్తుతం తను పలు సినిమాలలో నటిస్తోంది. మలయాళంలో డియర్ స్టూడెంట్స్ చిత్రంలో, సెంథిల్ నల్లస్వామి దర్శకత్వంలో రాకాయి, భక్తి నాటకానికి సీక్వెల్ గా మూకుత్తిత అమ్మన్ 2 , మోహన్ లాల్, మమ్ముట్టితో కలిసి మరో మలయాళ మూవీలో నటిస్తోంది నయనతార. ఈ సినిమాలతో పాటు ఇంకా పేరు పెట్టని 2 సినిమాలలో బిజీగా ఉంది తను. వీటికి రవి మోహన్ , దురై దర్శకత్వం వహించనున్నారు.
Also Read : Hero Jr NTR : తారక్ సెన్సేషన్ డైరెక్టర్స్ వైరల్