Nayanthara: యశ్ ‘టాక్సిక్‌’ సెట్ లో అడుగుపెట్టిన లేడీ సూపర్ స్టార్ !

యశ్ ‘టాక్సిక్‌’ సెట్ లో అడుగుపెట్టిన లేడీ సూపర్ స్టార్ !

Nayanthara: ‘కేజీఎఫ్‌’ సిరీస్‌ విజయాల తర్వాత యశ్‌ కథానాయకుడిగా నటిస్తున్న పాన్‌ ఇండియా చిత్రం ‘టాక్సిక్‌’. ప్రముఖ మలయాళ దర్శకురాలు గీతూ మోహన్‌దాస్‌ తెరకెక్కిస్తున్న ఈ సినిమాని కేవీఎన్‌ ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మిస్తోంది. కియారా అద్వానీ, నయనతార, హ్యూమా ఖురేషి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ కోసం యశ్‌తో కలిసి లేడీ సూపర్ స్టార్ నయనతార(Nayanthara) సెట్లోకి అడుగు పెట్టినట్లు సమాచారం. ప్రస్తుతం వీళ్లిద్దరిపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక దీని తర్వాత రెండో షెడ్యూల్‌ను యూకేలో చిత్రీకరించనున్నారని తెలిసింది. ఈ సినిమాలో సింహభాగం అక్కడే చిత్రీకరణ చేసుకోనుందని… దీనికోసం దాదాపు 150రోజులకు పైగా సుదీర్ఘ షెడ్యూల్‌ను ప్లాన్‌ చేస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. విజయవంతమైన ఆంగ్ల సిరీస్‌ ‘పీకీ బ్లైండర్స్‌’ ప్రేరణతో గీతూ ఈ కథను సిద్ధం చేసినట్లు ప్రచారం వినిపిస్తోంది. ఈ చిత్రంలో యశ్‌ శక్తిమంతమైన గ్యాంగ్‌స్టర్‌ పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్‌ 10న విడుదల కానుంది.

Nayanthara Movies Update

కేజీఎఫ్‌ చిత్రం తరువాత యశ్ నటించే సినిమా కావడంతో ఈ సినిమాపై ఎక్స్‌పెక్టేషన్స్‌ బాగా పెరిగిపోయాయి. దీనితో నటుడు యశ్ దానికి తగ్గట్టుగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కేవీఎన్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై రూపొందనున్న ఈ పాన్‌ ఇండియా చిత్రానికి మహిళా దర్శకురాలు గీతు మోహన్‌దాస్‌ తెరకెక్కించనున్నారు. దీంతో చిత్రంలో మల్టీ భాషలకు చెందిన ప్రముఖ తారాగణం నటించనున్నారు. ముఖ్యంగా బీబీసీ సీరీస్‌ పిక్కీ బ్‌లైండర్స్‌ తరహాలో తెరకెక్కనున్న ఈ గ్యాంగ్‌స్టర్స్‌ కథా చిత్రంలో యష్‌ సరసన కియారా అద్వానీ నాయకిగా నటిస్తున్నారు. మరో ప్రధాన పాత్రలో కరీనాకపూర్‌ నటించనున్నట్లు ప్రచారం జరిగింది. అయితే తాజాగా ఆమె పాత్రలో నయనతార వచ్చి చేరినట్లు తెలిసింది. ఇందులో ఈమె యశ్ కు సిస్టర్‌గా నటించనున్నట్లు సమాచారం. మరో విషయం ఏమిటంటే దర్శకురాలు ఈ చిత్ర షూటింగ్‌ను 200 రోజుల్లో పూర్తిచేయడానికి ప్రణాళికను సిద్ధం చేసుకున్నట్లు తెలిసింది. అందులో 150 రోజులు లండన్‌ పరిసర ప్రాంతాల్లోనే చిత్రీకరించనున్నట్లు సమాచారం. అందుకోసం చిత్ర యూనిట్‌ త్వరలో యూకేకు బయలుదేరనున్నట్లు తెలిసింది. ఇకపోతే ఈ చిత్రాన్ని 2025, ఏప్రిల్‌ 10వ తేదీన తెరపైకి తీసుకురావాలని నిర్ణయించనట్లు తెలిసింది.

Also Read : Fathers Day: ఫాదర్స్‌ డే సందర్భంగా స్పెషల్‌ ఫొటోలు పంచుకున్న మెగాస్టార్, బన్నీ !

Nayantharatoxicyash
Comments (0)
Add Comment