Nayanthara: ‘కేజీఎఫ్’ యశ్ సినిమాలో నయనతార ?

'కేజీఎఫ్' యశ్ సినిమాలో నయనతార ?

 Nayanthara:‘కేజీఎఫ్’ సిరీస్ తో పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న కన్నడ నటుడు యశ్… ప్రముఖ మలయాళ దర్శకురాలు గీతూ మోహన్‌దాస్‌ దర్శకత్వంలో ‘టాక్సిక్‌’ అనే సినిమాను ప్రకటించారు. మాదకద్రవ్యాల సరఫరా ఇతివృత్తంతో అత్యంత భారీ బడ్జెట్ తో యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. దీనితో యశ్ ‘టాక్సిక్‌’ సినిమా కోసం పాన్ ఇండియా రేంజ్ లో అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్‌ గా సాయి పల్లవి, కియారా అద్వానీ, శ్రుతీహాసన్‌ వంటి స్టార్స్‌ పేర్లు వినిపించాయి. అంతేకాదు యశ్‌ కు సోదరి పాత్రలో కరీనా కపూర్‌ నటిస్తారనే ప్రచారం జరిగింది. దీనికి తోడు తాను సౌత్‌ సినిమా అంగీకరించినట్లు ఆ మధ్య కరీనా స్వయంగా వెల్లడించారు. అది ‘టాక్సిక్‌’ సినిమానే అనే ప్రచారం సాగింది. అయితే తాజాగా షూటింగ్‌ కాల్షీట్స్‌ సర్దుబాటు చేయలేని కారణంగా ఈ ప్రాజెక్ట్‌ నుంచి కరీనా కపూర్‌ తప్పుకున్నారనే ప్రచారం జరుగుతోంది.

Nayanthara:

అయితే కరీనా కపూర్ స్థానాన్ని లేడీ సూపర్ స్టార్ నయనతార(Nayanthara) కొట్టేసారనే టాక్ ఇప్పుడు ఇండస్ట్రీలో నడుస్తోంది. జవాన్ సినిమాతో పాన్ ఇండియా హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న నయనతార మాత్రమే కరీనా కపూర్ స్థానాన్ని భర్తీ చేస్తుందనే నిర్ణయానికి చిత్ర యూనిట్ వచ్చినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే నయనతారను చిత్ర యూనిట్ సంప్రదించినట్లు తెలుస్తోంది. అన్ని అనుకున్నట్లు జరిగితే అతి త్వరలో చిత్ర యూనిట్ నుండి ఈ ప్రకటన వస్తుందని శాండిల్ వుడ్ టాక్. 2010లో ఉపేంద్ర నటించిన ‘సూపర్‌’ కన్నడలో ఎంట్రీ ఇచ్చిన నయనతారకు… ఈ ‘టాక్సిక్‌’ సినిమాకు ఓకే చేస్తే… పద్నాలుగేళ్ల తర్వాత ఆమె కన్నడ సినిమా చేసినట్లవుతుంది. ‘కేజీఎఫ్‌’ వంటి భారీ హిట్‌ ప్రాజెక్ట్‌ తర్వాత యశ్‌ నటిస్తోన్న సినిమా కావడంతో దీనిపై అందరిలో ఆసక్తి ఏర్పడింది. 2025 ఏప్రిల్ 10న ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు ఇప్పటికే చిత్ర యూనిట్ ప్రకటించింది.

Also Read:

kgfNayantharatoxicyash
Comments (0)
Add Comment