Nayanthara : ఓ పక్క పెద్దలకు ధన్యవాదాలు చెపుతూ ‘ధనుష్’ ని టార్గెట్ చేస్తూ వ్యాఖ్యానించిన నయన్

తాజాగా ఆమె సోషల్ మీడియాలో మూడు పేజీల ప్రకటనని విడుదల చేసింది...

Nayanthara : ప్రస్తుతం సౌతిండియన్ లేడి సూపర్ స్టార్ నయనతార ట్రెండింగ్‌లో ఉంది. ఒకవైపు ధనుష్ కాంట్రవర్సీ, కొత్త సినిమాల అప్డేట్స్‌తో పాటు నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీ రిలీజ్‌తో ఆమె హాట్ టాపిక్‌గా మారారు. ఇప్పటికే డాక్యుమెంటరీ రైట్స్ విషయంలో ధనుష్‌పై ఫైర్ అయినా ఆమె మరోసారి థ్యాంక్స్ చెబుతూనే పరోక్షంగా ధనుష్‌ని టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది.

Nayanthara Comment

ఇటీవలే నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ అయినా ‘నయనతార(Nayanthara): బియాండ్‌ ది ఫెయిరీ టేల్‌’ డాక్యుమెంటరీ పబ్లిక్ అటెన్షన్ ని గ్రాబ్ చేయగలిగింది. ఈ నేపథ్యంలోనే ఈ డాక్యుమెంటరీ కోసం తనకి సహకరించిన ప్రతి ఒక్కరికి ఆమె పేరు పేరున ధన్యవాదాలు తెలిపింది. తాజాగా ఆమె సోషల్ మీడియాలో మూడు పేజీల ప్రకటనని విడుదల చేసింది. హిందీ, తమిళ, తెలుగు, మలయాళం ఇండస్ట్రీల నుండి నయనతారకి సపోర్ట్ చేసిన నటులకి, ప్రొడ్యూసర్స్‌కి ఆమె కృతజ్ఞతలు తెలిపారు.

ఇందులో షారుఖ్ ఖాన్, చిరంజీవి, రామ్ చరణ్ పేర్లను ఆమె మెన్షన్ చేశారు. అయితే వీళ్ళందరూ తమ మూవీస్ లోని క్లిప్స్ వాడుకోవడానికి ‘నో అబ్‌జెక్షన్ సర్టిఫికెట్’లు జారీ చేశారు. కానీ, ధనుష్ చేయలేదు. ఈ డాక్యుమెంటరీ ట్రైలర్‌లో సినిమాలోని 3 సెకన్ల విజువల్స్ వాడుకున్నందుకు ధనుష్ రూ. 10 కోట్లు డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆమె ఈ పోస్ట్ కి ‘స్ప్రెడ్ లవ్’ అంటూ క్యాప్షన్ పెట్టి పరోక్షంగా ధనుష్ ని టార్గెట్ చేసినట్లు క్లియర్ గా తెలుస్తోంది. ఇక డాక్యుమెంటరీ విషయానికొస్తే.. . ధనుష్ కాంట్రవర్సీ‌తో అందరి దృష్టి దీనిపై పడింది. దీనికి పలు సెలబ్రిటీలు మద్దతు తెలిపిన క్రిటిక్స్, ఆడియెన్స్ మాత్రం తీసి అవతల పడేశారు. అసలు పెళ్లి క్యాసెట్‌ను ఓటీటీ‌కి అమ్మాలన్న చీప్ ఆలోచన నయనతారకు ఎందుకు వచ్చిందని నెటిజెన్స్ ట్రోల్ చేస్తున్నారు.

Also Read : Dil Raju : రివ్యూలు చెప్తామంటే ఒప్పుకునేదే లేదు

BreakingCommentsdhanushNayantharaViral
Comments (0)
Add Comment