Nayanthara: ఘనంగా నయనతార, విఘ్నేశ్‌ శివన్ రెండో వివాహ వార్షికోత్సవం !

ఘనంగా నయనతార, విఘ్నేశ్‌ శివన్ రెండో వివాహ వార్షికోత్సవం !

Nayanthara: దక్షిణాది భాషల లేడీ సూపర్ స్టార్ నయనతార(Nayanthara), కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ విఘ్నేశ్ శివన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మోస్ట్ సెలబ్రెటీ కపుల్ గా జూన్ 9, 2022న వివాహ బందంలో అడుగుపెట్టిన ఈ జంట… సరోగసీ పద్దతి ద్వారా కవల పిల్లలకు జన్మనిచ్చారు. వృత్తి రీత్యా ఇద్దరూ బిజీగా ఉంటూనే… పిల్లలకు కూడా చాలా ఎక్కువ సమయాన్ని కేటాయిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం తమ రెండో వివాహ వార్షికోత్సవాన్ని కుటుంబ సమేతంగా ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా నయన్ భర్త విఘ్నేశ్ శివన్‌ ఓ స్పెషల్ పోస్ట్ చేశారు. సోషల్ మీడియా వేదికగా తన భార్యతో కలిసి చిల్ అవుతోన్న వీడియోను అభిమానులతో పంచుకున్నారు.

Nayanthara Marriage Anniversary

విఘ్నేశ్ శివన్‌ తన ఇన్‌స్టాలో రాస్తూ… ‘పదేళ్ల నయనతార… రెండేళ్ల విక్కీ-నయన్. ఇవాళ మా రెండో వివాహా వార్షికోత్సవం. నిన్ను పెళ్లి చేసుకోవడం, ఉయిర్ ఉలగం రావడం నా జీవితంలోకి అతి గొప్పవిషయం. నా భార్య తంగమేయిని చాలా ప్రేమిస్తున్నా. నీతో మరెన్నో ఆహ్లాదకరమైన సమయాలు, జ్ఞాపకాలు, విజయవంతమైన క్షణాలు ఎప్పటికీ మర్చిపోలేను. ఎలాంటి పరిస్థితుల్లనైనా నీకు తోడుగా ఉంటా. ఆ భగవంతుడు ఎల్లవేళలా మనకు అండగా నిలవాలని కోరుకుంటున్నా. మన ఉయిర్, ఉలగంతో సంతోషంగా ఉండాలనేదే ఆశయం. ఆలాగే మన పెద్ద పెద్ద ఆశయాలు నెరవేరాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నా.’ అంటూ వీడియోను పోస్ట్ చేశారు.

ఇది చూసిన అభిమానులు విషెస్ చెబుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నయన్ గతేడాది జవాన్‌ మూవీతో సూపర్ హిట్ కొట్టింది. ఆ తర్వాత ఆమె నటించిన అన్నపూరణి చిత్రం విమర్శల ప్రశంసలు అందుకుంది.

Also Read : Jennifer Lopez: నాలుగో భర్తకు కూడా జెన్నిఫర్ లోపెజ్ గుడ్ బై ?

NayantharaVignesh Shivan
Comments (0)
Add Comment