Toxic : ఒకే ఒక్క సినిమాతో పాన్ ఇండియా హీరోగా మారి పోయాడు కన్నడ సినీ పరిశ్రమకు చెందిన సూపర్ స్టార్ యశ్. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన కేజీఎఫ్ రికార్డులను తిరగ రాసింది. భారతీయ సినిమాను షేక్ చేసింది. దేశ వ్యాప్తంగా చర్చకు దారి తీసేలా చేశాడు తన అద్భుతమైన నటనతో. కేజీఎఫ్ కు సీక్వెల్ గా తీశాడు దర్శకుడు. అది కూడా సూపర్ హిట్ గా నిలిచింది.
Toxic Movie Updates
సక్సెస్ కిక్కు ఇచ్చినా మౌనంగానే ఉన్నాడు నటుడు యశ్. తన తండ్రి ఆర్టీసీ డ్రైవర్ కావడంతో సింప్లిసిటీని ఎక్కువగా ఇష్ట పడతానని ఇప్పటికే పలుమార్లు ప్రకటించాడు. తాజాగా టాక్సిక్(Toxic) మూవీ చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. దీనికి జాతీయ పురస్కారం అందుకున్న దర్శకుడు గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తుండడం విశేషం.
తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఎవరు హీరోయిన్ గా ఉంటారనే దానిపై ఉత్కంఠకు తెర దించే ప్రయత్నం చేశారు మూవీ మేకర్స్. లేడీ సూపర్ స్టార్ గా గుర్తింపు పొందిన ప్రముఖ తమిళ సినీ నటి నయనతార(Nayanthara) యశ్ సరసన సీన్ షేర్ చేసుకోబోతోందంటూ వెల్లడించారు. దీంతో యశ్ , నయన్ అభిమానులు తెగ ముచ్చట పడుతున్నారు. ఇద్దరూ మోస్ట్ పాపులర్ . ఇద్దరి కాంబినేషన్ అదుర్స్ అనేలా ఉంటుందని అంటున్నారు.
అందాల ముద్దుగుమ్మ నయనతార నటించే విషయాన్ని బాలీవుడ్ నటుడు అక్షయ్ ఒబేరాయ్ కూడా కన్ ఫర్మ్ చేశాడు. యశ్ రాబోయే టాక్సిక్ పై భారీ అంచనాలు ఉన్నాయి.
Also Read : Hero Balayya Akhanda 2 : బాలయ్య చిత్రం మలయాళ సోయగం