Nayanatara: విద్యార్ధులకు బిర్యానీ వడ్డించిన నయనతార

విద్యార్ధులకు బిర్యానీ వడ్డించిన నయనతార

Nayanatara:దక్షిణాది భాషల్లో నిర్మించే సినిమాల్లో ప్రమోషన్లకు దూరంగా ఉండే అతి కొద్ది మంది హీరోయిన్లలో నయనతార ఒకరు. పెద్ద నిర్మాణ సంస్థ నిర్మించే సినిమాలో ఆమె నటించనప్పటికీ… ప్రమోషన్లకు చాలా దూరంగా ఉంటారు. ఇటీవల ఆమె ప్రధాన పాత్రలో తెరకెక్కిన లేడీ ఓరియంటెడ్ సినిమాలకు తప్ప… సినిమా ప్రమోషన్ ఇంటర్వూలు ఇవ్వడం కూడా అరుదుగా కనిపిస్తుంది.

అలాంటి నయనతార చెన్నైలోని ఓ లేడీస్ కాలేజీను ఆకస్మికంగా సందర్శించి అక్కడి విద్యార్ధినులకు సర్ ప్రైజ్ ఇచ్చింది. అంతేకాదు అక్కడి విద్యార్ధినిలకు స్వయంగా బిర్యానీ వడ్డించి… వారికి జీవితంలో మరిచిపోలేని జ్ఞాపకాన్ని అందించింది. ప్రస్తుతం కాలేజీ అమ్మాయిలతో నయనతార గడిపిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

Nayanatara – ‘అన్నపూరణి’ హిట్ తో జోష్ లో ఉన్న నయన్

దక్షిణాది లేడీ సూపర్‌స్టార్‌ గా గుర్తింపు పొందిన నయనతార తాజా సినిమా ‘అన్నపూరణి’. ది గాడెస్‌ ఆఫ్‌ ఫుడ్‌ అనే ట్యాగ్ లైన్ తో వచ్చిన ఈ సినిమాకు యువ దర్శకుడు నీలేశ్‌ కృష్ణ దర్శకత్వం వహించగా నయనతార(Nayanatara), జై ప్రధాన పాత్రల్లో నటించారు. ఒక బ్రాహ్మణ కుటుంబానికి చెందిన ఓ అమ్మాయి… ఇండియన్‌ బెస్ట్‌ చెఫ్‌గా ఎదగాలనుకున్న కలను ఎలా నెరవేర్చుకుందనేది అనే అంశాన్ని దర్శకుడు నీలేశ్‌ కృష్ణ చాలా ఆశక్తికంగా తెరకెక్కించాడు.

ఈ ఏడాది షారూక్ ఖాన్ తో నటించిన ‘జవాన్’ సినిమాతో మంచి జోష్ మీద ఉన్న నయనతార… తాజాగా ‘అన్నపూరణి’ తో ఫరవాలేదనిపించింది. ప్రస్తుతం ఎస్‌. శశికాంత్‌ దర్శకత్వంలో మాధవన్, సిద్ధార్ధ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిస్తున్న ‘టెస్ట్‌’ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు.

Also Read : Mohanlal: ఆకట్టుకుంటున్న మోహన్ లాన్ ‘మలైకోట్టై వాలిబన్‌’ పోస్టర్

nayanatara
Comments (0)
Add Comment