Heroine Nayanatara: లేడీ సూపర్‌ స్టార్‌ పిలుపుపై నయనతార అభ్యంతరం

లేడీ సూపర్‌ స్టార్‌ పిలుపుపై నయనతార అభ్యంతరం

Nayanatara: నాలుగు పదుల వయసుకు దగ్గరవుతున్నప్పటికీ దక్షిణాది భాషల్లో అగ్ర హీరోయిన్ కొనసాగుతున్న అతి కొద్దిమంది నటీమణుల్లో నయనతార ఒకరు. ఇటీవల అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘జవాన్‌’ సినిమాలో కింగ్ ఖాన్ షారూక్ సరసన తన యాక్షన్‌ తో అదరగొట్టింది. తాజాగా ‘అన్నపూరణి’ అనే లేడీ ఓరియంటెడ్ తమిళ సినిమాతో ప్రేక్షకులను పలకరించారు. దీనితో నయనతార(Nayanatara) అంటే లేడీ సూపర్ స్టార్ అంటూ పలువురు ప్రశంసిస్తున్నారు. దీనికి మరొక కారణం… తన పర్సనల్ లైఫ్ లో గాని, ప్రొఫెషనల్ లైఫ్ లో గాని ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొన్నా… వెనక్కి తగ్గకుండా కొనసాగిస్తున్న ఆమె స్పూర్తిదాయకమైన ప్రయాణం. అయితే ఇటీవల ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వూలో తనను లేడీ సూపర్ స్టార్ అని పిలవడంపై… నయనతార ఆశక్తికరమైన వ్యాఖ్యలు చేసారు. ఇప్పుడు అవి నెట్టింట వైరల్ గా మారుతున్నాయి.

Nayanatara Objection

తనని లేడీ సూపర్‌ స్టార్‌ అని పిలవడంపై ఆమె స్పందిస్తూ… ‘‘నన్ను లేడీ సూపర్‌ స్టార్‌ అని పిలవడం నాకు నచ్చదు. ఎవరైనా అలా పిలిస్తే నన్ను తిట్టినట్లు నాకు అనిపిస్తూ ఉంటుది. ‘జవాన్‌’ సినిమా తర్వాత చాలా మంది ఇదే పేరుతో పిలుస్తున్నారు. అదంతా వారి అభిమానం. ఈ రోజు నేను ఇంతమంది ప్రేమాభిమానాలు పొందుతున్నానంటే అది ఇండస్ట్రీ వల్ల నాకు దక్కిన గౌరవంగా భావిస్తా. ఇంత కీర్తిని పొందాలంటే ఎంతో అదృష్టం చేసుకోవాలి’’ అని చెప్పారు. దీనితో లేడీసూపర్ స్టార్ పిలుపుపై నయనతార చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ప్రస్తుతం నయనతార ఎస్ శశికాంత్ దర్వకత్వంలో తెరకెక్కిస్తున్న ‘టెస్ట్‌’ అనే సినిమాలోనూ నటిస్తున్నారు. ఆర్‌.మాధవన్‌, సిద్ధార్థ్‌ లు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Also Read : Hero Chiranjeevi: మెగాస్టార్ తో సినిమాకు సిద్ధం అంటున్న సందీప్ వంగా

Jawannayanatara
Comments (0)
Add Comment