Nayanatara: నెట్ ఫ్లిక్స్ లో ఆగిపోయిన నయనతార సినిమా !

నెట్ ఫ్లిక్స్ లో ఆగిపోయిన నయనతార సినిమా !

Nayanatara: దర్శకుడు నీలేష్ కృష్ణ దర్శకత్వంలో లేడి సూపర్‌ స్టార్‌ నయనతార(Nayanatara) నటించిన తాజా సినిమా ‘అన్నపూరణి: ది గాడెస్‌ ఆఫ్‌ ఫుడ్‌’. సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన అన్నపూరణికి దేశంలోనే నంబర్‌ వన్‌ చెఫ్‌ కావాలన్నది ఆశయం. తన ఆశయాన్ని నెరవేర్చుకోవడానికి మాంసాహార వంటలు చేయడంతో పాటు రుచి చూడటం కూడా చేస్తుంది. అంతేకాదు ఆ ప్రయాణంలో ఓ ముస్లిమ్‌ యువకుడితో ప్రేమలో పడటమే కాకుండా క్లైమాక్స్ ఫుడ్ కాంపిటీషన్ లో బిరియానీ చేసే ముందు నమాజ్ చేస్తుంది.

Nayanatara Movie Updates

డిసెంబర్‌ 1న థియేటర్లలో విడుదలై మిక్స్ డ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా డిసెంబరు 29న ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫాంలో విడుదలై ఇండియాలో పలు భాషల్లో టాప్ 10లో నిలిచి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. అయితే ఈ సినిమాలో హిందువుల మనోభావాలు దెబ్బతినేలా ఉన్నాయని, లవ్ జీహాద్ ను ప్రోత్సహించేలా ఉన్నాయని ఆరోపిస్తూ ఈ సినిమా నిర్మాతలతో పాటు నెట్ ఫ్లిక్స్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలంటూ బిజేపి నేత రమేశ్ సోలంకి మహారాష్ట్ర పోలీసులకు ఫిర్యాదు చేసారు. దీనికి తోడు మద్యప్రదేశ్ లోని జబల్పూర్ లో కూడా చిత్ర యూనిట్ పై కేసు నమోదు కావడంతో పాటు దేశంలో పలు చోట్ల బ్రాహ్మణ సంఘాల నుండి వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

‘అన్నపూరణి’ సినిమాపై రాజుకున్న వివాదం పెద్దదవుతుండటంతో… నష్ట నివారణా చర్యలను ప్రారంభించిన చిత్ర నిర్మాణ సంస్థ జీ స్టూడియోస్… “ఎవరి మతవిశ్వాసాలను కించపరిచే ఉద్దేశం తమకు లేదని, తమకు అన్ని మతాలూ సమానమేనని, ఈ విషయంలో తెలిసిగానీ, తెలియకగానీ ఎవర్నయినా బాధపెట్టి ఉంటే క్షమించాలని వివరణ ఇచ్చుకుంది,”. అయితే అయినప్పటికీ వివాదం సద్దుమణగకపోవడంతో జీ స్టూడియోస్‌ ఈ సినిమాను ఓటీటీ స్ట్రీమింగ్‌ నుంచి తొలగించింది. అంతేకాదు ఈ సినిమా స్ట్రీమింగ్‌ను నిలిపివేస్తున్నట్లు నెట్‌ఫ్లిక్స్‌ అధికారికంగా ప్రకటించింది. దీనితో ఓటీటీలో ‘అన్నపూరణి’ ఆట ఆగిపోయింది. అయితే ఇది తాత్కాలికమా లేక శాశ్వతమా అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వేచిచూడాల్సిందే.

ఎస్. ఆర్.రవీంద్రన్ సమర్పణలో నాస్ స్టూడియోస్ -ట్రైడెంట్ ఆర్ట్స్, జీ స్టూడియోస్ బ్యానర్‌పై దర్శకుడు నీలేష్ కృష్ణ తెరకెక్కించిన ఈ సినిమా డిసెంబరు 1న ప్రపంచ వ్యాప్తంగా విడుదలై యావరేజ్ టాక్ సొంతం చేసుకుంది. అయితే ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫాం నెట్ ఫ్లిక్స్ లో డిసెంబరు 29 నుండి అందుబాటులోనికి వచ్చిన ఈ సినిమా నెంబర్‌వన్‌గా దూసుకుపోతోంది. ఈ సినిమాలో ఆలయంలో శ్రీ మహా విష్ణువుకి నైవేధ్యాలు పెట్టే అగ్నిహోత్రం లాంటి సంప్రదాయ కుటుంబంలో పుట్టిన నయనతార(Nayanatara)… దేశంలో నెంబర్ వన్ చెఫ్ గా ఎదగడానికి ఎదుర్కొన్న సవాళ్ళను దర్శకుడు నీలేష్ కృష్ణ అద్భుతంగా తెరకెక్కించారు. ఈ సినిమాలో సత్యరాజ్‌, జై కీలక పాత్రలు పోషించారు.

Also Read : Bigboss Ashwini Sree: పవన్ కళ్యాణ్ నా వాడే అంటున్న బిగ్‌ బాస్‌ బ్యూటీ !

Annapuraninayanatara
Comments (0)
Add Comment