Nayanatara: నటి నయనతారపై కేసు నమోదు !

నటి నయనతారపై కేసు నమోదు !

Nayanatara: లేడి సూపర్‌ స్టార్‌ నయనతార నటించిన తాజా సినిమా ‘అన్నపూరణి: ది గాడెస్‌ ఆఫ్‌ ఫుడ్‌’. ఎస్. ఆర్.రవీంద్రన్ సమర్పణలో నాస్ స్టూడియోస్ -ట్రైడెంట్ ఆర్ట్స్, జీ స్టూడియోస్ బ్యానర్‌పై దర్శకుడు నీలేష్ కృష్ణ తెరకెక్కించిన ఈ సినిమా డిసెంబరు 1న ప్రపంచ వ్యాప్తంగా విడుదలై యావరేజ్ టాక్ సొంతం చేసుకుంది. అయితే ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫాం నెట్ ఫ్లిక్స్ లో డిసెంబరు 29 నుండి అందుబాటులోనికి వచ్చిన ఈ సినిమా నెంబర్‌వన్‌గా దూసుకుపోతోంది. ఈ సినిమాలో ఆలయంలో శ్రీ మహా విష్ణువుకి నైవేధ్యాలు పెట్టే సాంప్రదాయ కుటుంబంలో పుట్టిన నయనతార… దేశంలో నెంబర్ వన్ చెఫ్ గా ఎదగడానికి ఎదుర్కొన్న సవాళ్ళను దర్శకుడు నీలేష్ కృష్ణ అద్భుతంగా తెరకెక్కించారు.

Nayanatara Viral

అయితే ఈ సినిమాలో అన్నపూరణి పాత్రలో నయనతార(Nayanatara)… వెజిటేరియన్ వంటలను బాగా చేసే అన్నపూరణి.. నాన్ వెజిటేరియన్ వంటలను మాత్రం బాగా చేయలేకపోతుంది. దీనికి కారణం సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబం నుండి వచ్చిన ఆమె నాన్ వెజ్ వంటకాలను టేస్ట్ చేయకపోవడమే. దీనితో ఆమె తోటి నటుడు పర్హాన్… రామాయణంలో శ్రీరాముడు కూడా చికెన్ తిన్నాడంటూ నయనతారను ప్రోత్సహిస్తాడు. దీనితో ఆమె చికెన్ వంటకం టేస్ట్ చూసి నాన్ వెజిటేరియన్ వంటకాల్లో కూడా ఆధిపత్యం సంపాదిస్తుంది. దీనికి తోడు క్లైమాక్స్ ఫుడ్ కాంపిటీషన్ లో బిరియానీ వంట చేసే ముందు నమాజ్ చేస్తుంది.

అయితే ‘అన్నపూరణి: ది గాడెస్‌ ఆఫ్‌ ఫుడ్‌’ ఇప్పుడు వివాదంలో చిక్కుకుంది. ఈ సినిమాలో పలు సన్నివేశాలు హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయని ఆరోపిస్తూ మహారాష్ట్రకు చెందిన బిజేపి నేత రమేశ్ సోలంకి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ చిత్రం లవ్‌ జిహాద్‌ను ప్రోత్సహిస్తుందని ఆయన మండిపడ్డారు. ఈ మేరకు సినిమా నిర్మాతలతో పాటు స్ట్రీమింగ్‌ ప్లాట్‌ఫామ్‌ నెట్‌ఫ్లిక్స్‌ ఇండియాపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పోలీసులతోపాటు మహారాష్ట్ర హోంశాఖ మంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ను ట్విట్టర్‌ ద్వారా కోరారు. దీనిపై విచారణ జరిపిన పోలీసులు నయనతార, జై, నీలేశ్‌లతోపాటు నిర్మాతలు జతిన్‌ సేథీ, ఆర్‌ రవీంద్రన్‌, పునీత్‌ గోయెంకాలపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినట్లు తెలుస్తోంది.

Also Read : Naa Saami Ranga : సంక్రాంతి బరిలో ఉన్న నాగార్జున సినిమా హిట్ కొడుతుందా..?

Annapuraninayanatara
Comments (0)
Add Comment