Naveen Polishetty : రణబీర్ కపూర్, సాయిపల్లవి ‘రామాయణం’ సినిమాలో నవీన్ పోలిశెట్టి

ఈ సినిమాలో తనదైన కామెడీ టైమింగ్, నటనతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాడు...

Naveen Polishetty : యూట్యూబ్ లో షార్ట్స్ ఫిలిమ్స్ ద్వారా నటుడిగా కెరీర్ స్టార్ట్ చేసిన నవీన్ పోలిశెట్టి.. ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. తెలుగు, హిందీ భాషలలో పలు చిత్రాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించాడు. దివంగత హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ నటించిన చిచోరే సినిమాలో హీరో స్నేహితుడిగా కనిపించి నార్త్ అడియన్స్ కు దగ్గరయ్యాడు. ఆ తర్వాత ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమాతో హీరోగా వెండితెరకు పరిచయమయ్యాడు. మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్నాడు. తన నటనకు విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. ఇక డైరెక్టర్ అనుదీప్ కెవి తెరకెక్కించిన జాతిరత్నాలు సినిమాతో నవీన్ పోలిశెట్టి(Naveen Polishetty) క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది.

Naveen Polishetty Movie Updates

ఈ సినిమాలో తనదైన కామెడీ టైమింగ్, నటనతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాడు. ఈ సినిమా తర్వాత అనుష్క శెట్టితో కలిసి మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాతో అలరించాడు. ఆ తర్వాత పలు సినిమాలతో బిజీగా ఉన్న నవీన్.. కొన్ని నెలల క్రితం యాక్సిడెంట్ కావడంతో సినిమాలకు బ్రేక్ ఇచ్చాడు. కొన్నాళ్లు విశ్రాంతి తీసుకున్న తర్వాత తిరిగి తన ప్రాజెక్ట్స్ స్టార్ట్ చేశాడు. ఇటీవల నందమూరి బాలకృష్ణ హోస్టింగ్ చేస్తున్న అన్ స్టాపబుల్ టాక్ షోలో శ్రీలీలతో కలిసి సందడి చేశాడు నవీన్ పోలిశెట్టి. ఈ షోలో ఎన్నో విషయాలను పంచుకున్నాడు.

ఈక్రమంలోనే నవీన్ ను బాలయ్య ప్రశ్నిస్తూ.. బాలీవుడ్ లో నితీష్ తివారి తెరకెక్కిస్తోన్న రామాయణంలో నువ్వు లక్ష్మణుడి పాత్ర చేస్తున్నావని వార్తలు వినిపించాయి. నిజమేనా అని అడగ్గా.. నవీన్ మాట్లాడుతూ.. “ఇలాంటి రూమర్స్ వినడానికి బాగుంటాయి. నిజమైతే ఇంకా బాగుండు. ఇలాంటి రూమర్స్ ఎక్కువగా వ్యాప్తి చేయండి. అప్పుడైనా నాకు అలాంటి పాన్ ఇండియా ప్రాజెక్టులో అవకాశాలు వస్తే బాగుంటుంది” అంటూ క్లారిటీ ఇచ్చారు నవీన్. నితీష్ తివారీ తెరకెక్కిస్తున్న రామాయణంలో రణబీర్ కపూర్, సాయి పల్లవి సీతారాములుగా నటిస్తున్న సంగతి తెలిసిందే.

Also Read : Akshara Gowda : తల్లిగా ప్రమోషన్ పొందిన ప్రముఖ టాలీవుడ్ నటి

MoviesNaveen PolishettyTrendingUpdatesViral
Comments (0)
Add Comment